- కుల్దీప్ యాదవ్‌కు చాన్స్
- సంచలనంపై అఫ్గాన్ దృష్టి
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా సూపర్–8 పోరుకు రెడీ అయ్యింది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో వరుస విజయాలతో లీగ్ దశను అద్భుతంగా ముగించిన టీమిండియా అదే జోరు, ఫామ్‌ను ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే టైమ్‌లో ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. నెట్స్‌లో అతను వంద శాతం కష్టపడుతున్నా మ్యాచ్ టైమ్‌కు ఏదో రకంగా విఫలమవుతున్నాడు. దీంతో సూపర్–8 నుంచైనా కోహ్లీ జోరందుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌కు టీమిండియా కాంబినేషన్‌పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత మ్యాచ్‌ల్లో ఆడిన ఫైనల్ ఎలెవన్‌నే కొనసాగిస్తారా? లేక రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చాన్స్ ఇస్తారా? అనే చర్చ ఊపందుకుంది. పాత లైనప్‌తోనే బరిలోకి దిగాలని కెప్టెన్ రోహిత్ భావిస్తున్నా... పిచ్ స్పిన్నర్లకు అనుకూలమని సంకేతాలు వస్తుండటంతో కుల్దీప్‌కు చాన్స్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నది.
ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ లేదా ఫామ్‌లో లేని సిరాజ్‌లో ఒకర్ని తప్పించాల్సి ఉంటుంది. కానీ బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్‌ను కొనసాగిస్తేనే మేలనే ఆలోచన కూడా ఉంది. ఇక నలుగురు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జడేజాలను కంటిన్యూ చేయనున్నారు. బ్యాటింగ్‌లో రోహిత్, పంత్, సూర్యకుమార్ ఫర్వాలేదనిపిస్తున్నా పాండ్యా గాడిలో పడాలి. మిడిల్, డెత్ ఓవర్లలో భారీగా రన్స్ రాబట్టేందుకు ఎనిమిదో నంబర్ వరకు బ్యాటర్లు అందుబాటులో ఉండేలా రోహిత్ జాగ్రత్త పడుతున్నాడు. కాబట్టి దూబే, పాండ్యా, అక్షర్, జడేజాపై ఫినిషింగ్ బాధ్యత ఎక్కువగా ఉంది.
బౌలర్లతోనే డేంజర్..
సూపర్–8కు చేరుకోవాలనే మొదటి టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అఫ్గానిస్తాన్ ఇప్పుడు సంచలనాలపై దృష్టి పెట్టింది. అయితే అఫ్గాన్ బ్యాటింగ్ కంటే బౌలర్లతోనే ఇండియాకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. కెప్టెన్ రషీద్ స్పిన్‌కు, పేసర్ ఫారూఖీ స్పీడ్‌కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంది. ఓపెనింగ్‌లో ఫారూఖీ స్వింగ్‌ను నిలువరించాలి. అలాగే మిడిల్‌లో రషీద్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు అటాకింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కాబట్టి రోహిత్, కోహ్లీ అప్రమత్తంగా ఉండాలి. బ్యాటింగ్‌లో రెహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ కీలకం కానున్నారు. గుల్బాదిన్ నైబ్, నబీ, నజీబుల్లా కూడా చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు.
జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, సిరాజ్ / కుల్దీప్.
అఫ్గానిస్తాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), రెహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీమ్ జనత్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫారూఖీ.