AUS vs IND: రేపే భారత్-ఆస్ట్రేలియా డే నైట్ టెస్ట్.. టైమింగ్స్ వివరాలు ఇవే

భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు (డిసెంబర్ 6) రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ గా కనిపిస్తుంటే.. ఆస్ట్రేలియా జట్టు కాస్త ఒత్తిడిలో కనిపిస్తుంది. డే నైట్ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్ లో పింక్ బాల్ ను ఉపయోగించనున్నారు. దీంతో అభిమానులకు రేపు కొత్త అనుభవం ఎదురు కావడం గ్యారంటీ. ఆస్ట్రేలియాలో డే నైట్ కావడంతో ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం టైమింగ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.  

భారత కాలమాన ప్రకారం మ్యాచ్ ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 11:30 నిమిషాల వరకు ఈ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు 40 నిమిషాల పాటు లంచ్ విరామానికి వెళ్తారు. తిరిగి 12:10 నిమిషాలకు రెండో సెషన్ ప్రారంభమవుతుంది. 2:10 నిమిషాల వరకు ఈ సెషన్ ఉంటుంది. రెండు సెషన్ ల తర్వాత టీ విరామం 20 నిమిషాల పాటు ఉంటుంది. చివరి సెషన్ 2:30 నిమిషాల నుంచి 4:30 నిమిషాల వరకు ఉంటుంది. ఈ మ్యాచ్ చూడడానికి ఇప్పటికే గ్రౌండ్ హౌస్ ఫుల్ అయినట్టు సమాచారం. 

ALSO READ :  AUS vs IND: 100 పరుగులకే ఆలౌట్: ఆస్ట్రేలియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన భారత మహిళలు

ఒకరకంగా చెప్పాలంటే భారత్ లో టెస్ట్ మ్యాచ్ జరిగితే టైమింగ్స్ ఎలా ఉంటాయో.. ఏవ్ టైమింగ్స్ కావడం విశేషం. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొబైల్స్ లో డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. వెబ్‌సైట్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.