India vs Australia 5th Test : మళ్లీ టాప్ ఆర్డర్ ఢమాల్.. కష్టాల్లో టీమిండియా

India vs Australia  5th Test : మళ్లీ టాప్ ఆర్డర్ ఢమాల్.. కష్టాల్లో టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోపీలోని చివరి టెస్టులో కష్టాలో పడింది టీమిండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ను దెబ్బతీశారు ఆసీస్ బౌలర్లు. దీంతో 100పరుగులలోపే  నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా. 

ఓపెనర్లు జైశ్వాల్ 7, రాహుల్ 4 , శుభ్ మన్ గిల్ 20,  కోహ్లీ 17 రన్స్ కే పెవిలియన్ కు చేరారు. రిషబ్ పంత్ 32, జడేజా11 పరుగులతో క్రీజులో  ఉన్నారు.ప్రస్తుతం టీమిండియా స్కోర్ 50 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.

 ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో.. భారత్ కు పరుగులు రావడం కష్టంగా మారింది. ఇక ఫేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మను తప్పించింది టీమిండియా మేనేజ్మెంట్. రోహిత్ కు బదులు బూమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడని ప్రస్తుత కెప్టెన్ బూమ్రా తెలిపారు.