నవంబర్ 19, 2023.. ఈ తేదీ భారత అభిమానులకు ఒక పీడకలే అని చెప్పాలి. ఆస్ట్రేలియాపై వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతన్నారు. ఫామ్ లో ఉన్న మన ఆటగాళ్లు సొంత గడ్డపై ఈ సారి కప్ కొట్టడం గ్యారంటీ అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. అంచనాలకు తగ్గట్టుగానే ఫైనల్ కు వెళ్లిన రోహిత్ సేన ఆస్ట్రేలియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరిందింది.
ఈ ఫైనల్ ఓడిపోయినా.. మన అభిమానులు భారత ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. ఈ ఓటమిని ఇప్పుడిప్పుడే మర్చిపోతుండగా.. మరోసారి ఆస్ట్రేలియాతో భారత్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడబోతుంది. అయితే ఈ సారి కుర్రాళ్ళు ఆసీస్ తో ఆడేందుకు సిద్ధమయ్యారు. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకున్నాయి. తొలి సెమీ ఫైనల్లో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత కుర్రాళ్ళు 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాధారణ లక్ష్యమే అయినా సఫారీ బౌలర్ల ధాటికి కుర్రాళ్ళు మొదట తడబడ్డారు. దీంతో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయారు.
Also Read:సెమీస్‌లో నిఖత్, అరుంధతి
ఈ దశలో సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ భారీ భాగస్వామ్యంతో జట్టుకు ఫైనల్ కు చేర్చారు. మరో సెమీ ఫైనల్లో నిన్న పాక్ పై ఆసీస్ ఒక వికెట్ తేడాతో గెలిచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. పాక్ బౌలర్ల ధాటికి 180 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ చివరి ఓవర్ వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. దీంతో భారత్, ఆస్ట్రేలియా ఆదివారం టైటిల్ కోసం తలబడతాయి. మూడు నెలల క్రితం టీమిండియా సీనియర్ క్రికెట్ జట్టు ఆసీస్ మీద ఓడిపోయిన తర్వాత మరోసారి కుర్రాళ్లతో కూడిన ఈ రెండు దేశాలు ఫైనల్ కు చేరుకున్నాయి. దీంతో ఆసీస్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఇండియన్ ఫ్యాన్స్ కోటి ఆశలతో ఎదురు చుస్తున్నారు.
INDIA VS AUSTRALIA IN U19 WORLD CUP FINAL bas final mein heart break wali script change kar dena#U19WorldCup pic.twitter.com/lnBtKYkAuX
— ????ℎ??ᥫ᭡. (@thexkidd__) February 8, 2024
అండర్ 19 మ్యాచ్ అయినా ఈ ఫైనల్ మ్యాచ్ కు భారీ క్రేజ్ ఉండటం ఖాయం. ఎందుకంటే ఆసీస్ పై రివెంజ్ తీర్చుకునేందుకు ఇదే మంచి సమయమని మన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫిబ్రవరి 11 (ఆదివారం) ఫైనల్ జరగనుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుంది.
??⚔️?? India vs Australia in the WORLD CUP FINAL on a Sunday in South Africa????? pic.twitter.com/FNkRkBVckt
— KolkataKnightRiders (@KKRiders) February 8, 2024