మాజీ ఓపెనర్ సెహ్వాగ్ మాదిరిగా కెప్టెన్ రోహిత్ పవర్ ప్లేను సద్వినియోగం చేసుకొని చెలరేగిపోతున్నాడు. తన హై రిస్క్ గేమ్‌తో కోహ్లీ, గిల్ స్వేచ్ఛగా ఇన్నింగ్స్ నిర్మించేలా చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ ఓపెనింగ్ పవర్‌ప్లేలో హేజిల్‌వుడ్, స్టార్క్ బౌలింగ్‌లో తన మార్కు పుల్ షాట్లు ఆడగలడా? అన్న ప్రశ్న వస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, ఛేజింగ్‌లో అయినా రోహిత్ ఇచ్చే ఆరంభంపై ఇండియా ఎక్కువగా ఆధారపడుతోంది.
కానీ, టోర్నీ తొలి మ్యాచ్‌లో రోహిత్‌ను హేజిల్‌వుడ్ డకౌట్ చేశాడు. తను సీమ్ మూవ్‌మెంట్‌తో, స్కార్ట్ ఇన్‌స్వింగర్లతో రోహిత్‌కు గతంలోనూ సవాల్ విసిరారు. తన కెరీర్‌లో అతి ముఖ్యమైన మ్యాచ్ ఆడుతున్న రోహిత్ ఈ పోరులో ఈ ఇద్దరిపై ఏ మేరకు పైచేయి సాధిస్తాడన్నది జట్టుకూ కీలకం.
షమీ x ఆసీస్ ఓపెనర్లు
ఆరు మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు పడగొట్టిన షమీ కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. సూపర్ సీమ్ పొజిషన్‌తో షమీ మూవ్‌వెంట్‌ను అర్థం చేసుకోలేక బ్యాటర్లు బోల్తా కొడుతున్నారు. ఎరౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేస్తున్న షమీ ముఖ్యంగా లెఫ్టాండ్ బ్యాటర్లను ఘోరంగా దెబ్బకొడుతున్నాడు. బెన్ స్టోక్స్ లాంటి చాంపియన్ క్రికెటర్కూడా అతని ముందు నిలువలేకపోయాడు. సెమీస్‌లో వరుస ఓవర్లలో కివీస్ బ్యాటర్లు కాన్వే, రచిన్ రవీంద్రను పెవిలియన్ చేర్చి దెబ్బకొట్టాడు. తన బౌలింగ్‌లో లెఫ్టాండర్లు తడబడుతున్నారు. ఆసీస్ ఓపెనర్లు వార్నర్, హెడ్ ఇద్దరూ లెఫ్టాండర్లే కావడంతో బుమ్రాతో కలిసి షమీ కొత్త బాల్‌తో బౌలింగ్ ప్రారంభించే చాన్సుంది.
కోహ్లీ x జంపా
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కొన్నాళ్లుగా లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడుతున్నాడు. అదే టైమ్‌లో ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఎనిమిదిసార్లు కోహ్లీని ఔట్ చేసి అతనికి సవాల్ విసురుతున్నాడు. టోర్నీలో టాప్ స్కోరర్ కోహ్లీ, టాప్ స్పిన్నర్ అయిన జంపాకు మధ్య ఫైనల్లో ఆసక్తికర పోటీ నడవనుంది. జంపా స్ట్రెయిట్ బాల్స్‌తో స్టంప్స్‌ను టార్గెట్ చేసే చాన్సుంది. మరి తన బౌలింగ్‌లో కోహ్లీ జాగ్రత్తగా ఆడతాడా? ఎదురుదాడికి దిగుతాడా? చూడాలి.
వార్నర్ x బుమ్రా
ఈ టోర్నీలో బుమ్రా 10 మ్యాచ్‌ల్లో 3.98 ఎకానమీ రేట్‌తో 18 వికెట్లు పడగొట్టాడు. కానీ, 14 వన్డేల్లో వార్నర్‌ను ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోయాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎదుర్కొన్న 130 బాల్స్‌లో వార్నర్ 117 రన్స్ రాబట్టాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రా ఔట్ స్వింగర్లతో అదరగొడుతున్నాడు. టోర్నీలో 528 రన్స్‌తో జోరు మీదున్న వార్నర్‌కు ఈసారి చెక్ పెడతాడేమో చూడాలి.
కుల్దీప్ x మ్యాక్స్‌వెల్
మిడిల్ ఓవర్లలో ఇండియా చైనామన్ కుల్దీప్, ఆసీస్ హార్డ్ హిట్టర్ మ్యాక్స్‌వెల్‌కు మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ధర్మశాలలో కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ తప్పితే కుల్దీప్ బౌలింగ్‌లో మరే బ్యాటర్ ఎదురుదాడి చేసింది లేదు. తను స్ట్రెయిట్ షాట్ల కొట్టగా.. మ్యాక్స్‌వెల్ వైవిధ్యమైన షాట్లతో స్పిన్నర్లను టాకిల్ చేయగలడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో స్పిన్నర్లపై విరుచుకుపడి తను డబుల్ సెంచరీ చేశాడు. స్పిన్ బౌలింగ్‌లో మ్యాక్సీ కౌ కార్నర్‌ను టార్గెట్ చేస్తాడు. రివర్స్ స్వీప్‌తో స్పినర్లపై మానసికంగా పైచేయి సాధిస్తాడు. ఈ నేపథ్యంలో మ్యాక్సీని అడ్డుకునేందుకు కుల్దీప్ సరికొత్త వ్యూహాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
మా కెరీర్‌లోనే అతి పెద్ద డ్రీమ్
వరల్డ్ కప్ గెలవడం మా కెరీర్‌లోనే అతి పెద్ద డ్రీమ్. ఫైనల్లో తప్పులు చేస్తే గత 10 మ్యాచ్ విజయాలన్నీ వృథా అవుతాయి. బయట పరిస్థితులు, అంచనాలు, ఒత్తిడి, విమర్శలు ఎలా ఉంటాయో మాకు తెలుసు. ఎమోషనల్‌గా ఇది చాలా పెద్ద సందర్భం. ఇలాంటి టైమ్‌లో కూల్‌గా ఉండాలి. టోర్నీలో షమీ బౌలింగ్ సూపర్. టీమ్‌లో చాన్స్ లేనప్పుడు కూడా సిరాజ్, శార్దూల్‌కు చాలా సాయం చేశాడు. పిచ్‌ను బట్టి 11 మందిని ఎంచుకుంటాం. ఇండో–పాక్ మ్యాచ్ టైమ్‌లో పిచ్‌పై గ్రాస్ లేదు. కానీ ఇప్పుడు ఉంది. స్లో పిచ్‌గా అంచనా వేస్తున్నాం. టాస్ కీలకం. ఆసీస్ బలహీనతలపై దెబ్బకొట్టేందుకు మా బలాన్ని ఉపయోగించుకుంటాం. 20 ఏళ్ల కిందట ఏం జరిగిందో మేం ఆలోచించడం లేదు.
నా కెరీర్‌కు హైలైట్ అవుతుంది
గత వరల్డ్ కప్ ఫైనల్స్‌లో మా టీమ్స్ గొప్ప పెర్ఫామెన్స్ చేశాయి. దానిని కంటిన్యూ చేసే అవకాశం మాకు వచ్చింది. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ట్రోఫీ గెలవడం అతి పెద్ద విశేషంగా భావిస్తా. కప్ గెలిస్తే నా కెరీర్‌కూ హైలెట్ అవుతుంది. మా టీమ్‌లో ధైర్యం, నిలకడ ఉంది. ప్రతి మ్యాచ్‌లో ప్రతి ప్లేయర్ ఉత్సాహంగా ఉన్నాడు. ఈ ఒక్క మ్యాచ్ నెగ్గితే ఈ ఏడాది మరింత అద్భుతంగా గడిచిపోతుంది. ఇరుజట్లకు సమాన అవకాశాలున్నాయి. 2015లో ట్రోఫీ గెలిచిన టీమ్‌లోని ఆరుగురు ఇప్పుడు ఆడుతున్నారు. కాబట్టి వరల్డ్ కప్ గెలిస్తే వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. షమీ, కుల్దీప్, జడేజా బౌలింగ్‌లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇండియా అన్ని విభాగాల్లో బలంగా ఉంది.