AUS vs IND: టీమిండియాకు టెన్షన్ టెన్షన్.. ఐసీసీ నాకౌట్‌లో భయపెడుతున్న ఆసీస్ రికార్డ్

AUS vs IND: టీమిండియాకు టెన్షన్ టెన్షన్.. ఐసీసీ నాకౌట్‌లో భయపెడుతున్న ఆసీస్ రికార్డ్

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ మంగళవారం (మార్చి 4) ఈ మ్యాచ్ జరగనుంది. కంగారులతో సెమీ ఫైనల్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు ముందు ఐసీసీ ఈవెంట్స్ లో ఆస్ట్రేలియా రికార్డ్ టీమిండియాను కలవరపెడుతుంది. ఇప్పటివరకు వన్డే ఐసీసీ ఈవెంట్స్ లో భారత్ పై ఆస్ట్రేలియా రికార్డ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హెడ్-టు-హెడ్ రికార్డు:

వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చరిత్ర చూసుకుంటే అమోఘం. ఇప్పటికే 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది కంగారూల జట్టు. 1987,1999,2003,2007,2015,2023 సంవత్సరాలలో విశ్వ విజేతగా నిలిచింది. మరోవైపు భారత్ 1975, 2011 లలో వరల్డ్ కప్ గెలిచింది. అయితే ఈ రెండు జట్లు 2003, 2023 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడగా రెండు సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచి విశ్వ విజేతగా నిలిచింది. 2015 వన్డే వరల్డ్ కప్ లోనూ ఆస్ట్రేలియా టీమిండియాను చిత్తు చేసింది. ఈ రికార్డ్ భారత్ ను కంగారు పెడుతుంది. అంతేకాదు ఆస్ట్రేలియా ఖాతాలో రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2006, 2009లో కంగారూల జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. మరోవైపు భారత్ 2013 లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫి గెలుచుకుంది. 

వరల్డ్ కప్ లో కంగారూల హవా: 

వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చరిత్ర చూసుకుంటే అమోఘం. ఇప్పటికే 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది కంగారూల జట్టు. 1987,1999,2003,2007,2015,2023 సంవత్సరాలలో విశ్వ విజేతగా నిలిచింది. మరోవైపు భారత్ 1975, 2011 లలో వరల్డ్ కప్ గెలిచింది. అయితే ఈ రెండు జట్లు 2003, 2023 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడగా రెండు సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచి విశ్వ విజేతగా నిలిచింది. అంతేకాదు ఆస్ట్రేలియా ఖాతాలో రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఈ రికార్డ్ భారత్ ను కంగారు పెడుతుంది. అంతేకాదు ఆ జట్టు 2006, 2009 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. మరోవైపు భారత్ 2013 లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫి గెలుచుకుంది. 

భారత్ కే అనుకూలం: 

ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ ను శాసించింది. ప్రత్యర్థి ఎవరైనా చిత్తు చేయడం ఆ జట్టు అలవాటుగా మార్చుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి జట్టు కూడా బలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు అలవాటు పడిన దుబాయ్ పిచ్ పై కంగారులను ఓడించేందుకు సిద్ధంగా ఉంది. రోహిత్ సారధ్యంలో టీమిండియా ఫామ్ ను చూస్తుంటే ఈ సారి కంగారూల జట్టుకు పరాభవం తప్పేలా కనిపించడం లేదు. వేదిక దుబాయ్ స్టేడియం. ఆస్ట్రేలియాకు కీలక బౌలర్లు దూరం కావడం ఆ జట్టును కంగారు పెడుతోంది. స్టార్క్, కమిన్స్, హేజల్ వుడ్.. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో లేకపోవడం ఆ జట్టును మైనస్ గా మారింది.