ఆసియా కప్ 2023 సమరం ముగిసిన వెంటనే స్వదేశంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సిరీస్‌పై ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జియో సినిమా బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సిరీస్‌ను ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది.
సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో వన్డే సెప్టెంబర్ 24న మధ్యప్రదేశ్‌లోని హోల్కర్ స్టేడియంలో, చివరి వన్డే సెప్టెంబర్ 27న రాజ్ కోట్‌లోని ఖండేరి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1:30కు గంటలకు ప్రారంభంకానున్నాయి.
ALSOREAD:భద్రత ఇవ్వలేం.. పాకిస్తాన్ మ్యాచ్‌లు మరో చోట పెట్టుకోండి!: హైదరాబాద్ పోలీసులు
భారత్ vs ఆస్టేలియా వన్డే సిరీస్ షెడ్యూల్
మొదటి వన్డే (సెప్టెంబర్ 22) - ఐఎస్ బింద్రా స్టేడియం (మొహాలీ)
రెండో వన్డే (సెప్టెంబర్ 24) - హోల్కర్ స్టేడియం (మధ్యప్రదేశ్)
మూడో వన్డే (సెప్టెంబర్ 27) - ఖండేరి క్రికెట్ స్టేడియం (రాజ్‌కోట్)
?? The #MenInBlue are gearing up for an epic home battle! ⚔️
— JioCinema (@JioCinema) September 9, 2023
Don't miss a single moment of the #INDvAUS thrilling showdown, and the best part? The series is streaming for FREE in 11 languages, only on #JioCinema.#TeamIndia #TestedByTheBest pic.twitter.com/0Tu5JJ71MU