IND vs AUS: ప్లేయింగ్ 11లో వరుణ్,మెక్‌గుర్క్.. భారత్, ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే!

IND vs AUS: ప్లేయింగ్ 11లో వరుణ్,మెక్‌గుర్క్.. భారత్, ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే!

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే సూపర్ సెమీస్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. మంగళవారం (మార్చి 4) భారత్, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్ వేదికగా తొలి సెమీ ఫైనల్లో తలపడనున్నాయి. మరి కొన్ని గంటల్లో ఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్లు అమీ తుమీ తేల్చుకునేందుకు సై అంటున్నాయి. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మెగా సమరంలో రోహిత్ సేన ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.  భారత కాలమాన ప్రకారం మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.  

తొలి రెండు మ్యాచుల్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన భారత్.. అనూహ్యంగా కివీస్‌పై నలుగురిని రంగంలోకి దింపి మంచి ఫలితం సాధించింది. ఇందులో ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లు కాగా.. మరో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు. ఇదే జట్టును ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్లో బరిలోకి దింపొచ్చు. న్యూజిలాండ్ పై వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టాడు. దాంతో, అతన్ని తప్పించే ఆలోచన ఉండకపోవచ్చు. ఒకవేళ హర్షిత్ రానాను ఆడించాలనుకుంటే కుల్దీప్  బెంచ్ కు పరిమితం చేయొచ్చు. కుల్దీప్ ను కొనసాగిస్తే హర్షిత్ రాణా ప్లేయింగ్ 11 లో చోటు దక్కకపోవచ్చు. బ్యాటింగ్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. 

Also Read :- ఓరీ ‘హెడ్’ ఈసారికి వదిలేయరా

బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు.ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడం ఖాయం. వీరు ముగ్గురు జట్టులో ఉండడం వలన బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. 8 వ స్థానం వరకు భారత్ బ్యాటింగ్ దళం బలంగా ఉంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ తో ఆడిన జట్టులో ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. గాయపడిన షార్ట్ స్థానంలో జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ జట్టులో చేరనున్నాడు. 

తుది జట్లు(అంచనా)

భారత్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

ఆస్ట్రేలియా:

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.