IND vs AUS: బాగా ఆడినోళ్లదే విజయం: ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్‌కు కొత్త పిచ్

IND vs AUS: బాగా ఆడినోళ్లదే విజయం: ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్‌కు కొత్త పిచ్

ఛాంపియన్స్ ట్రోఫీలో మరి కొన్ని గంటల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్లాక్ బస్టర్ సెమీ ఫైనల్ జరగనుంది. మంగళవారం (మార్చి 4) దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని ఇరు జట్లు కసరత్తులు చేస్తున్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌–18, జియో హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మ్యాచ్ లైవ్ చూడొచ్చు. ఈ మ్యాచ్ కు ముందు పిచ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. 

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అన్ని మ్యాచ్ లు దుబాయ్ లో ఆడుతుండడం అనుకూలం అని ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దుబాయ్ లో జరగనున్న సెమీ ఫైనల్ కు కొత్త పిచ్ తయారు చేశారు. ఈ పిచ్ ఎలా ఉండబోతుందో ఇరు జట్లకు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. రెండు జట్లకు పిచ్ కొత్త కావడంతో బాగా ఆడిన జట్టే విజయం సాధిస్తుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. పిచ్ పొడిగా ఉందని, స్పిన్నర్లకు సహకారం లభిస్తుందని చెప్పాడు. 

Also Read:-కేకేఆర్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రహానె.. వెంకటేశ్ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వైస్ కెప్టెన్సీ..

పిచ్ మొత్తం చదరపు బ్లాక్ చాలా పొడిగా ఉంది. స్మిత్ వివరణ ప్రకారం దుబాయ్‌లో జరగబోతున్న కొత్త పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.  మొదటి ఇన్నింగ్స్‌లో పేసర్లకు అడ్వాంటేజ్. బంతి చాలా వేగంగా బ్యాట్‌కు వస్తుంది. దుబాయ్‌లో ఛేజింగ్ చేసే జట్టుకు  మంచు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. టాస్ గెలిచిన జట్టు మొదటగా బ్యాటింగ్ చేస్తుందని మేము ఆశిస్తున్నాం. అని ఆస్ట్రేలియా కెప్టెన్ మ్యాచ్ కు ముందు పిచ్ గురించి వివరించాడు. 

తుది జట్లు(అంచనా)

భారత్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

ఆస్ట్రేలియా:

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by cricketnmore (@cricketnmore)