IND vs AUS: రోహిత్, గిల్ ఔట్.. కష్టాల్లో టీమిండియా

IND vs AUS: రోహిత్, గిల్ ఔట్.. కష్టాల్లో టీమిండియా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‎తో జరుగుతోన్న సెమీస్‎ పోరులో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓ మోస్తారు లక్ష్యంతో చేధనకు దిగిన టీమిండియాకు ఆసీస్ బౌలర్లు ఝలక్ ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలో అదరగొట్టిన యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ కీలకమైన సెమీస్‎లో చేతులేత్తేశాడు. డ్వార్షుయిస్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌గిల్‌ ఔట్‌ (8) ఔటయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్లను తాకడంతో..  గిల్‌ నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. 

గిల్ ఔట్ అయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్ బౌలర్లపై విరుచుకు పడుతూ మాంచి ఫామ్‎లో కనిపించాడు. 29 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదిన హిట్ మ్యాన్ (28 రన్స్) వేగంగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. కూపర్‌కనోలి బౌలింగ్‌లో స్వీప్‌షాట్‌ ఆడబోయిన రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 

రోహిత్ రివ్యూ తీసుకున్నా భారత్‌కు ఫలితం అనుకూలంగా రాకపోవడంతో తీవ్ర నిరాశతో క్రీజ్ వీడాడు. ఈ మ్యాచులో తనకు లభించిన రెండు లైఫ్‌లను సద్వినియోగం చేసుకోలేకపోయాడు రోహిత్‌. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 8 ఓవర్లకు 43/2. విరాట్‌ కోహ్లీ(5 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ మంచి పార్టనర్‌షిప్ నెలకొల్పితే టీమిండియా కష్టాల నుంచి గట్టెక్కినట్టే.