మహిళల క్రికెట్ అనగానే పట్టించుకునే వారు చాలా తక్కువ. కానీ ఇది ఒకప్పటి మాట.. ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ దూసుకెళ్తుంది. భారత్, ఆస్ట్రేలియా మహిళల మధ్య జరిగిన టీ20 సిరీస్ కు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. రెండో టీ 20లో 42,418 మంది హాజరు కాగా.. నిన్న (జనవరి 9) జరిగిన మూడో టీ20కు 43,523 మంది మ్యాచ్ చూడడానికి వచ్చారు. సాధారణంగా ఇంత భారీ సంఖ్యలో అభిమానులను మెన్స్ క్రికెట్ లోనే చూస్తాం. అయితే వరల్డ్ లో రెండు టాప్ జట్లయినా భారత్, ఆస్ట్రేలియా తలపడంతో ఈ మ్యాచ్ క్రేజ్ పెరిగింది.
మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా భారత మహిళల జట్టు సొంతగడ్డపై చివరి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. బౌలింగ్‌లో సదర్లాండ్ (2/12), బ్యాటింగ్‌లో ఓపెనర్లు అలీసా హీలీ (38 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 55), బెత్ మూనీ (45 బాల్స్‌లో 5 ఫోర్లతో 52 నాటౌట్) విజృంభించడంతో మంగళవారం(జనవరి 10) జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. తొలి మ్యాచ్ లో భారత్ గెలవగా..వరుసగా రెండు, మూడు టీ20ల్లో ఓడిపోయింది. దీంతో 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 147/6 స్కోరు చేసింది. రిచా ఘోష్ (28 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34), స్మృతి మంధాన (28 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 29), షెఫాలీ వర్మ (17 బాల్స్‌లో 6 ఫోర్లతో 26) రాణించారు. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్, జార్జియా వారెహమ్ (2/24) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో ఆసీస్ 18.4 ఓవర్లలోనే 149/3 స్కోరు చేసి గెలిచింది. పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు పడగొట్టింది. సదర్లాండ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, హీలీకి ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు లభించాయి.
India women vs Australia women T20I series attendance :
— ???︎?︎??????????™ ??❤️ (@MSDianMrigu) January 10, 2024
• 1st T20I: 21,600 (January 5)
• 2nd T20I: 42,618 (January 7)
• 3rd T20I: 43,523 (January 9)
107,741 audiences attended the three match T20I series at DY Patil Sports Academy in Navi Mumbai. ?? pic.twitter.com/YMEP9JrOdC