టీమిండియాకు బంగ్లా షాక్.. కాసేపటికే కోలుకోలేని దెబ్బ కొట్టారుగా..!

టీమిండియాకు బంగ్లా షాక్.. కాసేపటికే కోలుకోలేని దెబ్బ కొట్టారుగా..!

చెన్నై: చిదంబరం స్టేడియం వేదికగా టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. టీమిండియా టాపార్డర్ను కుప్పకూల్చాడు. ఈ 24 ఏళ్ల యువ పేసర్ ధాటికి టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసింది. హసన్ మహ్మద్ బౌలింగ్లో టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ 6 పరుగులకే ఔటయ్యాడు. శుభ్మన్ గిల్ డకౌట్ అయి వెనుదిరిగాడు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా 6 పరుగులకే ఔట్ అయి నిరాశపరిచాడు. ఇలా టీమిండియా 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

రోహిత్, గిల్, కోహ్లీని ఔట్ చేసిన హసన్ మహ్మద్ టెస్ట్ క్రికెట్ కెరీర్ 2024లోనే మొదలైంది. శ్రీలంకతో మార్చి 30, 2024న జరిగిన టెస్ట్ మ్యాచ్తో ఈ యువ బౌలర్ టెస్ట్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు. 3 మ్యాచ్ల్లోనే 14 వికెట్లు తీసి అదరగొడుతున్నాడు. ఇక.. చెన్నై టెస్ట్లో టీమిండియా వికెట్ల పతనాన్ని పరిశీలిస్తే.. రోహిత్ శర్మ పేలవ ఆటతీరు కనబర్చాడు. శాంటోకు క్యాచ్గా దొరికిపోయాడు. లిటన్ దాస్కు గిల్, విరాట్ కోహ్లీ క్యాచ్గా దొరికిపోయి వికెట్లను సమర్పించుకున్నారు. యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.

Also Read : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

కారు ప్రమాదం నుంచి కోలుకుని క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 632 రోజుల తర్వాత మళ్లీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోకి అడుగుపెడుతున్నాడు. 2022లో బంగ్లాతో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత అతను కారు యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురయ్యాడు. మళ్లీ ఇప్పుడు అదే బంగ్లాతో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.  ఈ మధ్యలో చాలా జరిగినా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రం కాపాడుకున్నాడు. ఇటీవల దులీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీతో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రెడ్ బాల్ క్రికెట్‌‌‌‌లో తన రీఎంట్రీని ఘనంగా చాటాలని భావిస్తున్నాడు. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాణించిన ధ్రువ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పోటీ ఉన్నా.. గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఓటేశాడు.