
హైదరాబాద్, వెలుగు: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న జరిగే మూడో టీ20 మ్యాచ్ టికెట్ల సేల్ శనివారం మొదలవనుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్, వెబ్‌సైడర్ యాప్‌లో టికెట్లను విక్రయిస్తున్నట్టు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. టికెట్ల కనీస ధర రూ. 750, గరిష్ట ధర రూ. 15 వేలుగా ఉందన్నారు. ఆన్‌లైన్‌లో కొన్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు జింఖానా స్టేడియంలో రిడెంప్షన్ చేసుకొని ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లను నేరుగా అమ్మడం లేదని స్పష్టం చేశారు.