IND vs BAN 2024: వరుణిడిదే విజయం.. 35 ఓవర్లతో ముగిసిన తొలి రోజు

IND vs BAN 2024: వరుణిడిదే విజయం.. 35 ఓవర్లతో ముగిసిన తొలి రోజు

కాన్పూర్ టెస్ట్ లో తొలి రోజు ఆట ముగిసింది. వర్షం అంతరాయం కలిగించడంతో మొదటి రోజు 35 ఓవర్ల మాత్రమే సాధ్యపడింది. రెండు జట్లు సంతృప్తికరంగా తొలి రోజును ముగించాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40), రహీం (6) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ కు రెండు.. అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది. రేపు (రెండో రోజు) 9 గంటలకే ఆట ప్రారంభమయ్యే అవకాశముంది. 

వర్షం కారణంగా టాస్ గంట ఆలస్యం కావడంతో 9:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. 10:30 గంటలకు మొదలు కానుంది. పిచ్ పేస్ కు అనుకూలించనుండడంతో భారత్ మరోసారి ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగింది. వర్షం పడడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన బంగ్లా ఓపెనర్లు తొలి గంట సేపు ఆచితూచి ఆడారు. అయితే ఓపెనర్లు ఇద్దరు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో బంగ్లాదేశ్ 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లు ఆకాష్ దీప్ కు దక్కాయి. 

ALSO READ | IND vs BAN 2024: బంగ్లా ఓపెనర్ జిడ్డు బ్యాటింగ్.. 24 బంతులాడి డకౌటయ్యాడు

ఈ దశలో బంగ్లాదేశ్ ను కెప్టెన్ శాంటో,మోమినుల్ హక్ తీసుకున్నారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ మూడో వికెట్ కు 51 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అశ్విన్ ఒక అద్భుత బంతితో శాంటోను వెనక్కి పంపాడు. ఈ దశలో మోమినుల్ హక్ కు జత కలిసిన రహీం మరో నాలుగో వికెట్ కు అజేయంగా 27 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ ను నిలిపివేశారు. కాసేపటికే వర్షం భారీగా పడడంతో తొలి రోజు ముగుస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.