- మ. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
దంబుల్లా : విమెన్స్ ఆసియా కప్‌లో ఇండియా నాకౌట్ పోరుకు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా అదే జోరును కంటిన్యూ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన మరోసారి కీలకం కానున్నారు. మిడిల్‌లో జెమీమా రొడ్రిగ్స్, రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ కూడా భారీ స్కోర్లపై దృష్టి పెట్టారు.
ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, రాధా యాదవ్‌తో పాటు పేసర్లు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో మెరిస్తే ఇండియాకు తిరుగుండదు. ఇక బంగ్లాదేశ్‌ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. బలమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు నాణ్యమైన బౌలర్లు ఆ టీమ్‌లో ఉన్నారు. స్లో లెఫ్టార్మ్ బౌలర్ నహిదా అక్తర్, లెగ్ స్పిన్నర్ రబయా ఖాన్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. రాత్రి జరిగే మరో సెమీస్‌లో శ్రీలంక.. పాకిస్తాన్‌తో తలపడుతుంది.