IND vs BAN: బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ .. ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ వివరాలు ఇవే

IND vs BAN: బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ .. ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ వివరాలు ఇవే

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సమరానికి టీమిండియా సిద్ధమవుతుంది. బంగ్లాదేశ్ తో గురువారం (ఫిబ్రవరి 20) జరగబోయే మ్యాచ్ లో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ 2 గంటలకు వేస్తారు. బంగ్లాను పడగొట్టి టోర్నీలో శుభారంభం చేయడమే టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. గత చరిత్ర .. ఇటీవల ఫామ్‌‌‌‌, ముఖాముఖీ రికార్డు చూస్తే.. బంగ్లాకు ఇండియా అందనంత దూరంలో నిలిచింది. 

బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి లేదు.  చిన్న జట్టే అయినా.. బంగ్లా పులులు  ఎప్పుడు ఎలా ఆడుతారో తెలియదు. ఐదు నెలల కిందట ఆసియా కప్‌‌‌‌లో మనల్ని ఓడించారు. 2022లో తమ దేశంలో వన్డే సిరీస్‌‌‌‌లోనూ ఇండియాపై గెలిచారు. మొత్తంగా ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో ఆ జట్టే మూడుసార్లు నెగ్గింది. పైగా, లీగ్ స్టేజ్‌‌‌‌లో ఒక్క ఓటమి మొత్తం సమీకరణాలనే మార్చగలదు.  ఈ నేపథ్యంలో రోహిత్‌‌‌‌ సేన బంగ్లాను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకుండా ఆడాల్సి ఉంటుంది. 

ఈ మ్యాచ్ లో భారత్ ఎలాంటి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగుతుందో ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ జరగబోయే తొలి మ్యాచ్ కు రోహిత్ సేన ఎలాక్టే తుది జట్టుతో బరిలోకి దిగబోతుందో ఒక క్లారిటీ వచ్చేసింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు. వీరిద్దరిని జట్టు నుంచి తప్పించలేమని ఇప్పటికే హెడ్ కోచ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. \

ALSO READ | నేషనల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో.. తెలంగాణ అమ్మాయి దీప్తికి గోల్డ్‌‌‌‌

ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడం ఖాయం. వీరు ముగ్గురు జట్టులో ఉండడం వలన బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. 8 వ స్థానం వరకు భారత్ బ్యాటింగ్ దళం బలంగా ఉంటుంది. ఏకైక స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి కంటే కుల్దీప్ యాదవ్ కే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఫాస్ట్ బౌలర్ గా మహమ్మద్ షమీ జట్టులో ఉండడం ఖాయం. అతనితో పాటు మరో పేసర్ గా అర్షదీప్ సింగ్ కు అవకాశం దక్కనుంది. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ రాణా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ కు భారత జట్టు (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్ 

బంగ్లాదేశ్ తుది జట్టు (అంచనా): 

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్ 

పిచ్ రిపోర్ట్: 

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి బ్యాటింగ్ చేసిన జట్టుకు పిచ్ అనుకూలంగా ఉంటుంది. పవర్ ప్లే లో ఫాస్ట్ బౌలర్లకు తిప్పలు తప్పవు. బంతి పాత పడే కొద్దీ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఫాస్ట్ బౌలర్లు మిడిల్, డెత్ ఓవర్లలో ఎక్కువ కట్టర్లు, స్లో బాల్స్ వేయడంపై దృష్టి పెట్టాలని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. మ్యాచ్ సెకండ్ బ్యాటింగ్ సమయంలో స్పిన్నర్లకు పిటీసీ సహకరిస్తుంది.