బంగ్లాదేశ్‌పై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. తదుపరి టీ20లకు సన్నద్ధమవుతోంది. అక్టోబర్ 06 నుంచి ఈ ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20కి సింధియా క్రికెట్ స్టేడియం(గ్వాలియర్) ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండు, మూడు టీ20లు అరుణ్ జైట్లీ స్టేడియం(ఢిల్లీ), రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం(హైదరాబాద్) వేదికగా జరగనున్నాయి.
టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు నజ్ముల్ హొస్సేన్ శాంటో నాయకత్వం వహిస్తుండగా, భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలగడంతో యువ బ్యాటర్లకు ఈ సిరీస్ ఓ చక్కని అవకాశమని చెప్పుకోవాలి.
టీ20 సిరీస్ షెడ్యూల్
- మొదటి టీ20: అక్టోబర్ 06 (సింధియా క్రికెట్ స్టేడియం, గ్వాలియర్)
- రెండో టీ20: అక్టోబర్ 09 (అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ)
- మూడో టీ20: అక్టోబర్ 12 (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్)
టీ20 మ్యాచ్‍లన్నీ భారత కాలమానం ప్రకారం, రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్- బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌ను స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిజిటల్‌గా Jio యాప్‌లో హిందీ, ఇంగ్లీష్ సహా తొమ్మిది భాషల్లో లైవ్ ఆస్వాదించవచ్చు.
Also Read:-ముగిసిన మినీ ఐపీఎల్ వేలం.. అమ్ముడుపోని సఫారీ కెప్టెన్
ఇరు జట్లు:
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మద్ ఉల్లా, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షాక్ మహేదీస్ హసన్, రిషాఫ్ హసన్, రిషాఫ్ హసన్ తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, రకీబుల్ హసన్.