గ్వాలియర్: టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కోసం సన్నద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇరుజట్ల మధ్య తొలి పోరు జరగనుంది. అయితే టెస్ట్‌ల్లో ఆడిన చాలా మంది ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చిన మేనేజ్‌మెంట్ యంగ్ ప్లేయర్లను బరిలోకి దించుతోంది. ముఖ్యంగా స్పీడ్‌స్టర్ మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసే చాన్స్ కనిపిస్తోంది.
ఐపీఎల్‌లో 150 కిలో మీటర్ల స్పీడ్ వేసిన అతను ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లోనూ అదే జోరు చూపెడతాడా. దేశవాళీ క్రికెట్‌లో చూపే ఫిట్‌నెస్‌ను బట్టి ఇండియా టీమ్‌లోకి తీసుకుంటారు. కానీ ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్న మయాంక్‌కు చాలా తొందరగా చాన్స్ ఇస్తున్నారు. ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ కూడా రేస్‌లో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత నితీష్ జింబాబ్వే టూర్‌కు ఎంపికైనా అతను ఆడలేకపోయాడు. గిల్, పంత్, జైస్వాల్, సిరాజ్, అక్షర్ పటేల్‌కు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. దీంతో కెప్టెన్ సూర్య, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ జట్టు భారాన్ని మోయాల్సి ఉంటుంది. దూబే ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన తిలక్ వర్మకు అవకాశం వస్తుందో లేదో చూడాలి. ఓపెనర్ అభిషేక్ శర్మకు తోడుగా శాంసన్ బరిలోకి దిగొచ్చు. రియాన్ పరాగ్ ఫామ్‌లోకి వస్తే భారీ స్కోరు ఖాయం. స్పిన్నర్ రవి బిష్ణోయ్, జితేష్ శర్మపై కూడా భారీ ఆశలు ఉన్నాయి.
గెలుపే లక్ష్యంగా..
మరోవైపు సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ లేకుండా బంగ్లాదేశ్ ఈ సిరీస్‌ను ఆడబోతున్నది. ఇటీవలే అతను టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పాడు. దీంతో షకీబ్ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ కోసం బంగ్లా వెతుకుతోంది. రెగ్యులర్ టీ20 ప్లేయర్లు లేకపోవడం కూడా బంగ్లాకు కాస్త లోటుగా కనిపిస్తోంది. ఆఫ్ స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ 14 నెలల తర్వాత టీమ్‌లోకి వచ్చాడు. మహ్మదుల్లాది కూడా ఇదే పరిస్థితి. కెప్టెన్ శాంటో, లిటన్ దాస్, పర్వేజ్, తన్జిద్‌పై బ్యాటింగ్ భారం పడనుంది. వీళ్లు మెరిస్తే భారీ స్కోర్లను ఆశించొచ్చు. బౌలింగ్‌లో ముస్తాఫిజుర్, తస్కిన్ నుంచి ప్రమాదం పొంచి ఉంది.
జట్లు (అంచనా)
ఇండియా: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, నితీష్ కుమార్, పాండ్యా, రింకూ సింగ్, సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్/ హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ శాంటో (కెప్టెన్), లిటన్ దాస్, పర్వేజ్ ఇమన్, తన్జిద్ హసన్, మెహిదీ హసన్, తౌహిద్ హ్రిదోయ్, మహ్మదుల్లా, రిషాద్ హుస్సేన్, హసన్ షకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్.