IND vs ENG: ఫామ్‌లో ఉన్నా ఆ ఇద్దరికీ నో ఛాన్స్.. తొలి వన్డేకు టీమిండియా తుది జట్టు ఇదే

IND vs ENG: ఫామ్‌లో ఉన్నా ఆ ఇద్దరికీ నో ఛాన్స్.. తొలి వన్డేకు టీమిండియా తుది జట్టు ఇదే

ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో భాగంగా గురువారం (ఫిబ్రవరి 6) తొలి మ్యాచ్‌‌‌‌ జరగనుంది. నాగ్ పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ ప్రకటించింది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందో ఆసక్తికరంగా మారింది.

ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ రావడం ఖాయం. ఇటీవలే సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ లో జైశ్వాల్ నిరాశ తప్పేలా కనిపించడం లేదు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వస్తాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, పంత్ లలో ఒకరికే ఛాన్స్ దక్కనుంది. అయ్యర్ కు నాలుగో స్థానంలో ఆడిన అనుభవం ఉండడంతో అతడికే అవకాశం దక్కనుంది. వికెట్ కీపర్ బ్యాటర్ గా రాహుల్ జట్టులో కొనసాగనున్నాడు. పంత్ గట్టి పోటీనిచ్చినా రాహుల్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపనుంది.

2023 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో పంత్‌‌‌‌ లేనప్పుడు రాహుల్‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌ భారాన్ని మోశాడు. ఏకంగా 452 రన్స్‌‌‌‌తో సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌ చూపెట్టాడు. ఆరో స్థానంలో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. స్పిన్ ఆల్ రౌండర్లుగా జడేజా, అక్షర్ పటేల్ కు ఛాన్స్ దక్కనుంది. సుందర్ ఫామ్ లో ఉన్నప్పటికీ అతనికి ప్లేయింగ్ లో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ లేదా వరుణ్ చక్రవర్తిలో ఎవరికి స్థానం దక్కుతుందో ఆసక్తి కరంగా మారింది. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ పంచుకుంటారు. 

తుది జట్టు (అంచనా)

ఇండియా:

రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), గిల్‌‌‌‌, కోహ్లీ, శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌/ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌, రాహుల్‌‌‌‌, హార్దిక్‌‌‌‌ పాండ్యా, జడేజా, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, షమీ. 

ఇంగ్లండ్‌‌‌‌:
 
బట్లర్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), డకెట్‌‌‌‌, ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌, జో రూట్‌‌‌‌, హ్యారీ బ్రూక్‌‌‌‌, లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌, జాకబ్‌‌‌‌ బెతెల్‌‌‌‌, బ్రైడన్‌‌‌‌ కార్సీ, ఆర్చర్‌‌‌‌, రషీద్‌‌‌‌, సకీబ్‌‌‌‌ మహ్ముద్‌‌‌‌.