ఇంగ్లండ్‌‌‌‌ను చెడుగుడు ఆడేసుకున్నారు

  • ఐదు వికెట్లు తీసి మ్యాచ్ ను తిప్పేసిన అశ్విన్ 
  • ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌ 134 ఆలౌట్‌‌‌‌
  • ఇండియా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ 329 ఆలౌట్‌‌‌‌
  • రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీ

అసలే సొంతగడ్డ.. ఆపై టర్నింగ్‌‌‌‌ ట్రాక్‌‌‌‌.. ఇంకేముంది ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ (5/43).. చెపాక్‌‌‌‌లో చెలరేగిపోయాడు..! బంతిని బొంగరంలా మెలికలు తిప్పుతూ.. ఇంగ్లండ్‌‌‌‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు..! మిగతా బౌలర్లు కూడా తలా ఓ చేయి వేయడంతో  విజిటింగ్‌‌‌‌ టీమ్‌‌‌‌ బొక్క బోర్లా పడింది..! దీంతో సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో విరాట్‌‌‌‌సేన డ్రైవర్‌‌‌‌ సీట్‌‌‌‌లోకి వచ్చేసింది..! ఇప్పటికే మంచి లీడ్‌‌‌‌లో ఉన్న ఇండియా… భారీ టార్గెట్‌‌‌‌ను నిర్ధేశించే దిశగా అడుగులు వేస్తోంది..! అయితే థర్డ్‌‌‌‌ డే ఎలా ఆడుతుందన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది!!

చెన్నై: టర్నింగ్‌‌‌‌ ట్రాక్‌‌‌‌పై స్పిన్‌‌‌‌ తంత్రాన్ని అద్భుతంగా వర్కౌట్‌‌‌‌ చేసిన ఇండియా.. సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో పట్టు బిగించింది. ఓవైపు అశ్విన్‌‌‌‌.. మరోవైపు పేసర్లు సమయోచితంగా రాణించి.. ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌ను బెంబేలెత్తించారు. ఫలితంగా ఆదివారం రెండో రోజు ఇంగ్లండ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 59.5 ఓవర్లలో 134 రన్స్‌‌‌‌కు కుప్పకూలింది. బెన్‌‌‌‌ ఫోక్స్‌‌‌‌ (44 నాటౌట్‌‌‌‌) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా ఆట ముగిసే టైమ్‌‌‌‌కు సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో వికెట్‌‌‌‌ నష్టానికి 54 రన్స్‌‌‌‌ చేసింది. రోహిత్‌‌‌‌ (25 బ్యాటింగ్‌‌‌‌), పుజారా (7 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. గిల్‌‌‌‌ (14) మళ్లీ విఫలమయ్యాడు. అంతకుముందు 300/6 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో సెకండ్‌‌‌‌ డే ఆట కొనసాగించిన ఇండియా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 95.5 ఓవర్లలో 329 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. కేవలం ఫస్ట్‌‌‌‌ సెషన్‌‌‌‌లో ఏడు ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా మరో 29 రన్స్‌‌‌‌ జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (58 నాటౌట్‌‌‌‌) ఓ ఎండ్‌‌‌‌లో స్థిరంగా నిలబడినా.. రెండో ఎండ్‌‌‌‌లో సహకారం కరువైంది. డే సెకండ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోనే మొయిన్‌‌‌‌ అలీ (4/128) ఇండియాకు డబుల్‌‌‌‌ షాక్‌‌‌‌ ఇచ్చాడు. నాలుగు బంతుల వ్యవధిలో అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (5), ఇషాంత్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేశాడు. మరో ఐదు ఓవర్ల తర్వాత స్టోన్‌‌‌‌ (3/47).. మూడు బాల్స్‌‌‌‌ వ్యవధిలో కుల్దీప్‌‌‌‌ (0), సిరాజ్‌‌‌‌ (4)ను పెవిలియన్‌‌‌‌కు చేర్చడంతో ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌కు తెరపడింది. ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ లీడ్​195 రన్స్‌‌‌‌‌‌ను కలుపుకుని ఇండియా 294 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇంగ్లండ్‌‌‌‌ 39/4..

మార్నింగ్‌‌‌‌ సెషన్‌‌‌‌లోనే బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌‌‌కు ఇండియా బౌలర్లు చుక్కలు చూపెట్టారు. ఇన్నింగ్స్‌‌‌‌ మూడో బాల్‌‌‌‌కే ఇషాంత్‌‌‌‌ (2/22) సూపర్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌తో వేసిన బాల్‌‌‌‌కు ఓపెనర్‌‌‌‌ బర్న్స్‌‌‌‌ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. సిబ్లీ (16), లారెన్స్‌‌‌‌(9) ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఇండియా స్పిన్నర్ల ముందు తేలిపోయారు. సెకండ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోనే బౌలింగ్‌‌‌‌కు వచ్చిన అశ్విన్‌‌‌‌.. అద్భుతమైన టర్నింగ్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. ఎనిమిదో ఓవర్‌‌‌‌లో అతను వేసిన టర్నింగ్‌‌‌‌ బాల్‌‌‌‌కు సిబ్లీ.. లెగ్‌‌‌‌ స్లిప్‌‌‌‌లో కోహ్లీకి క్యాచ్‌‌‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. రివ్యూలో ఇండియా సక్సెస్‌‌‌‌ అయ్యింది. పిచ్‌‌‌‌ క్షీణించడం మొదలుకావడంతో రెండు ఎండ్‌‌‌‌ల నుంచి స్పిన్నర్లను తీసుకొచ్చిన కోహ్లీ.. ఇంగ్లండ్‌‌‌‌పై ఒత్తిడిని పెంచాడు. దీంతో ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఆడుతున్న అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (2/40) కూడా బాల్‌‌‌‌ను బాగా టర్న్‌‌‌‌ చేశాడు. ఫలితంగా తన రెండో ఓవర్‌‌‌‌లోనే రూట్‌‌‌‌ (6) వికెట్‌‌‌‌ తీసి ఇండియా ఆనందాన్ని రెట్టింపు చేశాడు. లారెన్స్‌‌‌‌తో జతకలిసిన స్టోక్స్‌‌‌‌ (18) వికెట్‌‌‌‌ కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. కనీసం సింగిల్స్‌‌‌‌ తీసేందుకు కూడా సాహసించలేదు. ఓ ఎండ్‌‌‌‌లో స్థిరంగా బౌలింగ్‌‌‌‌ చేసిన అశ్విన్‌‌‌‌.. 18వ ఓవర్‌‌‌‌లో లారెన్స్‌‌‌‌ను వెనక్కి పంపాడు. దీంతో లంచ్‌‌‌‌ వరకు ఇంగ్లండ్‌‌‌‌ 39/4 స్కోరుతో కష్టాల్లో పడింది.

స్పిన్‌‌‌‌-పేస్‌‌‌‌ కలయికతో ..

సెకండ్‌‌‌‌ సెషన్‌‌‌‌లో కంప్లీట్‌‌‌‌గా అశ్విన్‌‌‌‌, అక్షర్‌‌‌‌ డామినేషన్‌‌‌‌ నడిచింది. మధ్యలో సిరాజ్‌‌‌‌, ఇషాంత్‌‌‌‌ తమ వంతు పాత్రను సమర్థంగా పోషించారు. చైనామన్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌తో పెద్దగా అవసరం రాకపోవడంతో జస్ట్‌‌‌‌ ఆరు ఓవర్లకే పరిమితం చేశారు. బ్రేక్‌‌‌‌ నుంచి వచ్చిన తర్వాత స్టోక్స్‌‌‌‌, పోప్‌‌‌‌ (22) యధావిధిగా డిఫెన్స్‌‌‌‌కే కట్టుబడ్డారు. కానీ అశ్విన్‌‌‌‌ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. క్రీజులో ఎంత టాప్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ ఉన్నా మంచి టర్నింగ్‌‌‌‌తో కట్టిపడేశాడు. దాని ఫలితంగా సెషన్‌‌‌‌ ఆరో ఓవర్‌‌‌‌లో అశ్విన్‌‌‌‌ వేసిన హాఫ్‌‌‌‌ వ్యాలీని డిఫెన్స్‌‌‌‌ చేయబోయిన స్టోక్స్‌‌‌‌ క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. 52 రన్స్‌‌‌‌కే సగం జట్టు పెవిలియన్‌‌‌‌కు చేరడంతో.. ఇంగ్లిష్‌‌‌‌ లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ పూర్తి ఒత్తిడిలో పడింది. ఈ టైమ్‌‌‌‌లో వచ్చిన ఫోక్స్‌‌‌‌ ఒంటరిగా పోరాటం మొదలుపెట్టాడు. పోప్‌‌‌‌తో కలిసి దాదాపు 15 ఓవర్ల పాటు వికెట్‌‌‌‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. కానీ 39వ ఓవర్‌‌‌‌లో సిరాజ్‌‌‌‌ను బౌలింగ్‌‌‌‌కు దించడం బాగా వర్కౌట్‌‌‌‌ అయ్యింది. ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కే పోప్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి షాకిచ్చాడు. ఇక ఫోక్స్‌‌‌‌ స్థిరంగా నిలబడినా.. రెండో ఎండ్‌‌‌‌లో మొయిన్‌‌‌‌ అలీ (6), స్టోన్‌‌‌‌ (1) ఎనిమిది బాల్స్‌‌‌‌ తేడాలో వెనుదిరిగారు. ఫలితంగా టీ విరామానికి ఇంగ్లండ్‌‌‌‌ 107/8 స్కోరు చేసింది. థర్డ్‌‌‌‌ సెషన్‌‌‌‌లో మరో పది ఓవర్లు మాత్రమే ఆడిన ఇంగ్లండ్‌‌‌‌ మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. ఫోక్స్‌‌‌‌ ఫర్వాలేదనిపించినా.. లీచ్‌‌‌‌ (5), బ్రాడ్‌‌‌‌ (0) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌ స్కోరే చేయడంతో ఇంగ్లండ్‌‌‌‌ చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది.

స్కోరు బోర్డు

ఇండియా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: రోహిత్‌‌‌‌ (సి) అలీ (బి) లీచ 161, గిల్‌‌‌‌ (ఎల్బీ) స్టోన్‌‌‌‌ 0, పుజారా (సి) స్టోక్స్‌‌‌‌ (బి) లీచ్‌‌‌‌ 21, కోహ్లీ (బి) అలీ 0, రహానె (బి) అలీ 67, పంత్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 58, అశ్విన్‌‌‌‌ (సి) పోప్‌‌‌‌ (బి) రూట్‌‌‌‌ 13, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (స్టంప్‌‌‌‌) ఫోక్స్‌‌‌‌ (బి) అలీ 5, ఇషాంత్‌‌‌‌ (సి) బర్న్స్‌‌‌‌ (బి) అలీ 0, కుల్దీప్‌‌‌‌ (సి) ఫోక్స్‌‌‌‌ (బి) స్టోన్‌‌‌‌ 0, సిరాజ్‌‌‌‌ (సి) ఫోక్స్‌‌‌‌ (బి) స్టోన్‌‌‌‌ 4,

మొత్తం: 95.5 ఓవర్లలో 329 ఆలౌట్‌‌‌‌.

వికెట్లపతనం: 1–0, 2–85, 3–86, 4–248, 5–249, 6–284, 7–301, 8–301, 9–325, 10–329.

బౌలింగ్‌‌‌‌: బ్రాడ్‌‌‌‌ 11–2–37–0, ఓలి స్టోన్‌‌‌‌ 15.5–5–47–3, లీచ్‌‌‌‌ 27–3–78–2, స్టోక్స్‌‌‌‌ 2–0–16–0, మొయిన్‌‌‌‌ అలీ 29–3–128–4, రూట్‌‌‌‌ 11–3–23–1.

ఇంగ్లండ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: బర్న్స్‌‌‌‌ (ఎల్బీ) ఇషాంత్‌‌‌‌ 0, సిబ్లీ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌‌‌‌ 16, లారెన్స్‌‌‌‌ (సి) గిల్‌‌‌‌ (బి) అశ్విన్‌‌‌‌ 9, రూట్‌‌‌‌ (సి) అశ్విన్‌‌‌‌ (బి) పటేల్‌‌‌‌ 6, ఫోక్స్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 42, మొయిన్‌‌‌‌ అలీ (సి) రహానె (బి) పటేల్‌‌‌‌ 6, స్టోన్‌‌‌‌ (సి) రోహిత్‌‌‌‌ (బి) అశ్విన్‌‌‌‌ 1, లీచ్‌‌‌‌ (సి) పంత్‌‌‌‌ (బి) ఇషాంత్‌‌‌‌ 5, బ్రాడ్‌‌‌‌ (బి) అశ్విన్‌‌‌‌ 0, ఎక్స్‌‌‌‌ట్రాలు: 9, మొత్తం: 59.5 ఓవర్లలో 134.

వికెట్లపతనం: 1–0, 2–16, 3–23, 4–39, 5–52, 6–87, 7–105, 8–106, 9–131, 10–134.

బౌలింగ్‌‌‌‌: ఇషాంత్‌‌‌‌ 5–1–22–2, అశ్విన్‌‌‌‌ 23.5–4–43–5, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ 20–3–40–2, కుల్దీప్‌‌‌‌ 6–1–16–0, సిరాజ్‌‌‌‌ 5–4–5–1.

ఇండియా సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: రోహిత్‌‌‌‌ (బ్యాటింగ్‌‌‌‌) 25, గిల్‌‌‌‌ (ఎల్బీ) లీచ్‌‌‌‌ 14, పుజారా (బ్యాటింగ్‌‌‌‌) 7, ఎక్స్‌‌‌‌ట్రాలు: 8,

మొత్తం: 18 ఓవర్లలో 54/1.

వికెట్లపతనం: 1–42, బౌలింగ్‌‌‌‌: స్టోన్‌‌‌‌ 2–0–8–0, లీచ్‌‌‌‌ 9–2–19–1, మొయిన్‌‌‌‌ అలీ 7–2–19–0.

ఇవి కూడా చదవండి

కళ్లు చెదిరే క్యాచులతో అదరగొట్టిన పంత్

అశ్విన్‌.. రికార్డుల జోరు

25 మందిని కాపాడిన ఫోన్‌ కాల్‌: ధౌలిగంగ ఉప్పొంగుతోంది కొడుకా ఉరుకు

గ్రెటా థన్‌బర్గ్ ‘టూల్ కిట్’కు సాయం.. బెంగళూరు స్టూడెంట్‌ అరెస్ట్‌

మరిన్ని వార్తలు