ఇంగ్లాండ్ తో మరికొన్ని గంటల్లో టీమిండియా రెండో టెస్టు ఆడనుంది. వైజాగ్ వేదికగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో గెలుపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతుంది. తొలి టెస్టులో ఓడిపోయన తర్వాత రోహిత్ సేన ఈ టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ టెస్టులో ఓడితే తర్వాత మూడు టెస్టులు గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఇంగ్లాండ్ ను మట్టికరిపించాలని చూస్తుంది. ఇదిలా ఉండగా తుది జట్టు ఎంపిక టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది.
ఓపెనర్లుగా జైస్వాల్, రోహిత్ కన్ఫర్మ్ కాగా మూడో స్థానంలో గిల్, మిడిల్ ఆర్డర్ లో అయ్యర్ కు జట్టు యాజమాన్యం మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తుంది. అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా స్థానాలకు ఎలాంటి ముప్పు లేదు. మిగిలిన మూడు స్థానాల కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాల వలన కోహ్లీ తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకోవడంతో రజత్ పటిదార్ కు స్థానం దక్కింది. హైదరాబాద్ టెస్ట్ తర్వాత రాహుల్ గాయపడడంతో సర్ఫరాజ్ ను ఎంపిక చేశారు. రాహుల్ లేకపోవడంతో ఈ ప్లేస్ లో ఎవరు ఆడతారో అని ఆసక్తి నెలకొంది.
వస్తున్న సమాచారం ప్రకారం వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్టులో పటిదార్ నాలుగో స్థానంలో ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఇక బౌలింగ్ కూర్పు విషయంలో భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అశ్విన్, అక్షర్ పటేల్ తో పాటు కుల్దీప్ యాదవ్, వాషింగ్ టన్ సుందర్ ఈ మ్యాచ్ లో ఆడనున్నట్లు తెలుస్తుంది. వీరందరూ తుది జట్టులో ఉంటే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అదే జరిగితే తొలి మ్యాచ్ లో ప్రభావం చూపని సిరాజ్ పై వేటు పడటం ఖాయం. ఇప్పటికే ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రజత్ పాటిదార్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ , కెఎస్ భరత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లాండ్ తుది జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్( వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్.
4 Spinners and 1 Pacer for Team India in Vizag??? pic.twitter.com/AmI9qoeiEv
— CricketGully (@thecricketgully) February 1, 2024
?England name XI for 2nd Test ?
— SportsTiger (@The_SportsTiger) February 1, 2024
England made two changes with Shoaib Bashir replacing Jack Leach who has been ruled out with a knee injury. James Anderson comes in for Mark Wood.
?: ECB#INDvENG #TestCricket #EnglandCricket #JamesAnderson #ShoaibBashir #MarkWood #BenStokes… pic.twitter.com/c0cUeeqBKX