రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో జరిగిన కీలక టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో చతికిలపడింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ 51 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. లివింగ్ స్టోన్ కూడా 24 బంతుల్లో 5 సిక్సులు, ఒక ఫోర్‌తో 43 పరుగులతో టీమిండియాను కంగారు పెట్టేశాడు.
బట్లర్ 24 పరుగులు చేశాడు. అడిల్ రషీద్ 10, మార్క్ వుడ్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లండ్ జట్టుకు మరో 20 పరుగులు జోడించడంతో 171 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ను ఆ జట్టు సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 31 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. సంజూ శాంసన్ 3 పరుగులు, అభిషేక్ శర్మ 24 పరుగులకే ఔట్ కావడంతో టీమిండియా మిడిలార్డర్ పై ఆశలు పెట్టుకుంది.
ALSO READ | IND vs ENG 3rd T20I: వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు.. తడబడి నిలబడిన ఇంగ్లండ్
అస్సలు ఫామ్‌లో లేని సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో కూడా 14 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. తిలక్ వర్మ 18 పరుగులకే ఔట్ అయ్యాడు. హార్థిక్ పాండ్యా రూపంలో ఆశలు చిగురించినప్పటికీ 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్‌కు క్యాచ్‌గా దొరికిపోయి టీమిండియా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. బ్యాట్స్‌మెన్స్ రాణించకపోవడంతో ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది.
ఫలితంగా.. సిరీస్ చేజిక్కించుకోవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయి 2-1 ఆధిక్యంలో టీమిండియా నిలిచింది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్ టన్ 3 వికెట్లతో రాణించగా, ఆర్చర్ 2, కార్స్ 2, అడిల్ రషీద్, మార్క్ వుడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 40 పరుగులు చేసిన హార్థిక్ పాండ్యా అదే దూకుడును కొనసాగించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని టీమిండియా అభిమానులు నిట్టూరుస్తున్నారు. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో మరో రెండు మ్యాచులు మిగిలి ఉన్నాయి. పుణెలో జనవరి 31న టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
#TeamIndia put up a fight but England won the third T20I by 26 runs!
— BCCI (@BCCI) January 28, 2025
India will look to bounce back in the fourth T20I in Pune. 👍 👍
Scorecard ▶️ https://t.co/amaTrbtzzJ#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/t0l42NwbvX