ఇంగ్లాండ్ తో టీమిండియా శుక్రవారం (జనవరి 31) నాలుగో టీ20కి సిద్ధమవుతుంది. పూణే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. తొలి రెండు టీ20ల్లో గెలిచి ఊపు మీదున్న సూర్య సేనకు మూడో టీ20లో ఇంగ్లాండ్ షాక్ ఇచ్చింది. దీంతో నేడు జరగనున్న టీ20 మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని చూస్తుంది. మరోవైపు మూడో టీ20లో ఇచ్చిన జోష్ లో నాలుగో టీ20 గెలవాలని ఇంగ్లాండ్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి మార్పులతో బరిలోకి దిగుతుందో ఇప్పుడు చూద్దాం.
మూడో టీ20కి గాయం కారణంగా దూరమైన రింకూ సింగ్ కోలుకున్నాడు. అతను నేడు జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉన్నాడు. రింకూ ప్లేయింగ్ 11లో ధృవ్ జురెల్ స్థానంలో ఆడతాడు. వాషింగ్ టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబేకు అవకాశం దక్కొచ్చు. మూడో టీ20కి రెస్ట్ తీసుకున్న అర్షదీప్ సింగ్ కీలకమైన నాలుగో టీ20కి బరిలోకి దిగడం దాదాపుగా ఖాయం. అదే జరిగితే అతను ఎవరి స్థానంలో ఆడతాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. షమీకి ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇస్తే అతని స్థానంలో అర్షదీప్ ఆడతాడు. ఈ మూడు మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తుంది.
ALSO READ : ఫేవరెట్‌గా ఇండియా ..ఇవాళ(జనవరి 31) ఇంగ్లండ్‌తో సెమీస్ పోరు
మరోవైపు ఇంగ్లాండ్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. రాజ్‌కోట్ మ్యాచ్‌లో విజయంతో ఇంగ్లండ్ తిరిగి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంది. ఆ పోరులో బట్లర్‌సేన బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇండియా కంటే మెరుగ్గా ఆడింది. ఓపెనర్ బెన్ డకెట్ ఫిఫ్టీతో ఫామ్ అందుకోగా.. మిడిలార్డర్లో లివింగ్‌స్టోన్ కూడా టచ్‌లోకి రావడంతో ఆ జట్టు బలం పెరిగినట్టయింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రాజ్‌కోట్‌లో రెండు వికెట్లతో గాడిలో పడగా.. జెమీ ఓవర్టన్ కూడా సత్తా చాటడం ఆ జట్టుకు శుభసూచకం. స్పిన్నర్ ఆదిల్ రషీద్ మొదటి నుంచి ఇండియా బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడు.