100లోపే చాప చుట్టేసిన ఇంగ్లండ్.. టీమిండియా గెలుపు అంటే ఇది.. అభి‘‘షేక్’’ ఆడించాడు..

100లోపే చాప చుట్టేసిన ఇంగ్లండ్.. టీమిండియా గెలుపు అంటే ఇది.. అభి‘‘షేక్’’ ఆడించాడు..

ముంబై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్ పూర్తిగా వన్సైడ్గా సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఘోరంగా విఫలమైన ఇంగ్లండ్ జట్టు 97 పరుగులకే చాప చుట్టేసింది. 10.3 ఓవర్లకు 97 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా అదరగొట్టింది. 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించి టీమిండియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే టీ20 సిరీస్ దక్కించుకున్న టీమిండియా వాంఖడే వేదికగా జరిగిన ఈ నామమాత్రపు ఫైనల్ మ్యాచ్లో ఆల్ రౌండ్ షోతో సత్తా చాటింది.

తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి పేస్ బౌలింగ్ వేస్తున్నాడా..? స్మిన్ బౌలింగ్తో వస్తున్నాడా..? అని అభిషేక్ శర్మ ఆలోచించలేదు. బాదుడే బాదుడు. సెంచరీతో దుమ్మురేపి 13 సిక్స్లు, ఏడు ఫోర్లతో 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ 16, తిలక్ వర్మ 24, శివం దూబే 30, అక్సర్ పటేల్ 15 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.

ALSO READ | IND vs END 5th T20I: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత జట్టులో ఏకైక మార్పు

248 పరుగుల భారీ లక్ష్యంతో ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది. 3 సిక్సులు, 7 ఫోర్లతో 23 బంతుల్లో 55 బంతులతో ఫిలిప్ సాల్ట్ హాఫ్ సెంచరీ చేసి దూకుడుగా ఆడాడు. అయితే.. సాల్ట్ బౌలింగ్కు శివం దూబే అడ్డుకట్ట వేశాడు. శివం దూబే బౌలింగ్లో ధ్రువ్ జ్యురెల్కు సాల్ట్ క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. మిగిలిన ఇంగ్లండ్ ఆటగాళ్లు మొత్తం వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. బెన్ డకెట్ 0, బట్లర్ 7, హ్యారీ బ్రూక్ 2, లియామ్ లివింగ్ స్టోన్ 9, జాకోబ్ బెతెల్ 10, కార్స్ 3, ఓవర్ టన్ 1, ఆర్చర్ 1, అదిల్ రషీద్ 6, మార్క్ వుడ్ 0.. ఇదీ పేలవంగా సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ తీరు.

ALSO READ | INDvs ENG: వాంఖడేలో సిక్స్‌ల సునామీ.. టీమిండియా భారీ స్కోరు

అభిషేక్ శర్మ బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా ఔరా అనిపించాడు. ఒక ఓవర్ బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు నోరెళ్లబెట్టేలా చేశాడు. టీమిండియా బౌలర్లలో షమీ వికెట్లతో రాణించగా వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అభిషేక్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. రవి బిష్ణోయికి ఒక వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3 వికెట్లతో రాణించగా, మార్క్ వుడ్ 2 వికెట్లు, ఆర్చర్, ఓవర్ టన్, అదిల్ రషీద్ తలో వికెట్ తీశారు. ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో 4-1 ఆధిక్యంతో టీ20 సిరీస్ టీమిండియా వశమైంది. వాస్తవానికి నాలుగో టీ20 మ్యా్చ్లో గెలుపుతోనే టీమిండియా 3-1 ఆధిక్యంతో సిరీస్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా జట్లు మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో తలపడనున్నాయి.