కళ్లు చెదిరే క్యాచులతో అదరగొట్టిన పంత్

చెన్నై: ధోనీ వారసుడిగా టీమ్‌‌లోకి వచ్చిన రిషబ్‌‌ పంత్‌‌ బ్యాటింగ్‌‌లో మెరుస్తున్నా.. వికెట్‌‌ కీపింగ్‌‌లో మాత్రం తేలిపోతున్నాడని చాలా రోజుల నుంచి ఉన్న విమర్శ. కానీ సెకండ్‌‌ టెస్ట్‌‌లో పంత్‌‌ అందుకున్న రెండు స్టన్నింగ్‌‌ క్యాచ్‌‌లు చూస్తే వావ్‌‌ అనాల్సిందే. అక్రోబాటిక్‌‌ విన్యాసాలను తలపిస్తూ ఎడమ వైపు డైవ్‌‌ చేస్తూ సింగిల్‌‌ హ్యాండ్‌‌తో బాల్స్‌‌ను అందుకోవడం హైలెట్‌‌. ముందుగా 39వ ఓవర్‌‌లో సిరాజ్‌‌ వేసిన ఫస్ట్‌‌ బాల్‌‌ను పోప్‌‌ లెగ్‌‌ సైడ్‌‌ ఫ్లిక్‌‌ చేశాడు. బ్యాట్స్‌‌మన్‌‌ గ్లౌజ్‌‌ను తాకుతూ వేగంగా  దూసుకొచ్చిన బాల్‌‌ను… ఎడమ వైపు డైవ్‌‌ చేస్తూ పంత్‌‌ సూపర్బ్‌‌గా అందుకున్నాడు.  ఫుట్‌‌బాల్‌‌ గోల్‌‌ కీపర్‌‌ విన్యాసాన్ని తలపిస్తూ అతను లెఫ్ట్‌‌ ఎల్బో మీదుగా ల్యాండ్‌‌ అయిన తీరును చూస్తే అదుర్స్‌‌ అనాల్సిందే. దీంతో సిరాజ్‌‌కు సొంతగడ్డపై ఫస్ట్‌‌ టెస్ట్‌‌లో ఫస్ట్‌‌ వికెట్‌‌ అందించాడు. ఇక 59వ ఓవర్‌‌లో ఇషాంత్‌‌ వేసిన యాంగిల్‌‌ బాల్‌‌ను లీచ్‌‌ జస్ట్‌‌ టచ్‌‌ చేశాడు. ఫస్ట్‌‌ స్లిప్‌‌, కీపర్‌‌ మధ్యలో మెరుపు వేగంతో వచ్చిన బాల్‌‌ను లెఫ్ట్‌‌ సైడ్‌‌ ఫుల్‌‌ లెంగ్త్‌‌తో డైవ్‌‌ చేసిన పంత్‌‌ వన్‌‌ హ్యాండ్‌‌తో అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌‌‌‌ను చెడుగుడు ఆడేసుకున్నారు

అశ్విన్‌.. రికార్డుల జోరు

25 మందిని కాపాడిన ఫోన్‌ కాల్‌: ధౌలిగంగ ఉప్పొంగుతోంది కొడుకా ఉరుకు

గ్రెటా థన్‌బర్గ్ ‘టూల్ కిట్’కు సాయం.. బెంగళూరు స్టూడెంట్‌ అరెస్ట్‌