IND vs ENG: ప్రయోగాలపై టీమిండియా దృష్టి..చివరి టీ20లో నలుగురికి రెస్ట్

IND vs ENG: ప్రయోగాలపై టీమిండియా దృష్టి..చివరి టీ20లో నలుగురికి రెస్ట్

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్‌‌తో ఆదివారం (ఫిబ్రవరి 2) చివరిదైన ఐదో మ్యాచ్‌‌కు రెడీ అయ్యింది. జోరు మీదున్న టీమిండియా ఈ మ్యాచ్‌‌లోనూ గెలిచి 4–1తో సిరీస్‌‌ను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు చివరి టీ20 లో గెలిచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. చివరి టీ20కి ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

సిరీస్ ఎలాగో గెలుచుకోవడంతో టీమిండియా బెంచ్ ను పరీక్షించాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని రమణ్ దీప్ సింగ్ నేడు జరగనున్న మ్యాచ్ లో బరిలోకి దిగడం గ్యారంటీ. నాలుగో టీ20లో కన్కషన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ కింద వచ్చిన హర్షిత్ రానా ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోనున్నాడు. స్పిన్ ఆల్ రౌండర్ సుందర్ తో పాటు వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కు ఈ మ్యాచ్ లో ఛాన్స్ దక్కొచ్చు. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య, రవి బిష్ణోయ్, తిలక్ వర్మలకు రెస్ట్ ఇవ్వొచ్చు. 

మరోవైపు సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్‌‌  ఈ మ్యాచ్‌‌లో గెలవాలని భావిస్తోంది. ఇది జరగాలంటే ఇంగ్లిష్‌‌  టీమ్ బ్యాటర్లు మరోసారి మెరవాల్సి ఉంటుంది. బ్రూక్‌‌ ఫామ్‌‌లోకి రాగా.  టాప్‌‌లో సాల్ట్‌‌, డకెట్‌‌, బట్లర్‌‌ చెలరేగాలి. ఆర్చర్‌‌, కార్సీ రన్స్‌‌ కట్టడి చేయడంలో ఫెయిలవుతున్నారు. దీనిపై దృష్టి పెడితే ఇండియాను అడ్డుకోవడం కష్టం కాకపోవచ్చు. నాలుగో టీ20లో బరిలోకి దిగిన జట్టే చివరి మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది. 

ఐదో టీ20 భారత్, ఇంగ్లాండ్ తుది జట్లు అంచనా  

భారత్: 

సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ధృవ్ జురెల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే,రమణదీప్ సింగ్, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా

ఇంగ్లాండ్:

ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్