డబ్లిన్: ఇప్పటికే సిరీస్ పట్టేసి ఆఖరాటలో మరికొందరు కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆశించిన టీమిండియా ఆశలపై వాన దేవుడు నీళ్లు కుమ్మరించాడు. ఇండియా–ఐర్లాండ్ మధ్య బుధవారం జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వాన కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దయింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఇండియా 2–0తో సిరీస్ ఖాతాలో వేసుకుంది.
మ్యాచ్ టైమ్‌కు ముందు నుంచే చిన్నపాటి వర్షం మొదలైంది. ఇండియా టైమ్ ప్రకారం రాత్రి పది గంటలకు వాన ఆగినా గ్రౌండ్ మొత్తం చిత్తడిగా మారింది. కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాలేదు. దాంతో పదిన్నరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. అంతకుముందు చంద్రయాన్3 ల్యాండింగ్‌ను టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్‌లోని టీవీలో లైవ్ చూశారు.