ఈ నెల18న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా–మలేసియా ఫుట్బాల్ జట్ల మధ్య జరిగే ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్కు సంబంధించిన పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.