ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఒక్క రిషబ్ పంత్(64) మినహా మిగిలిన టీమిండియా బ్యాట్స్మెన్స్ చేతులెత్తేయడంతో 25 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. జైశ్వాల్(5), రోహిత్ శర్మ (11), గిల్(1) బౌల్డ్, విరాట్ కోహ్లీ(1), సర్ఫరాజ్ ఖాన్(1) , రవీంద్ర జడేజా (6) పరుగులు. ఇదీ టీమిండియా బ్యాటింగ్ కొనసాగిన తీరు.
న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 174 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 121 పరుగులకే ఆలౌట్ అయి న్యూజిలాండ్ వైట్ వాష్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. 147 పరుగుల టార్గెట్ను కూడా టీమిండియా ఛేజ్ చేయలేక చతికిలబడిందంటే మనోళ్ల ఆటతీరు ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ALSO READ : ఓటమి అంచుల్లో ఇండియా-ఎ
టీమిండియాను కివీస్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ పెద్ద దెబ్బ కొట్టాడు. 6 వికెట్లు తీసి టీమిండియా బ్యాటింగ్ను కకావికలం చేశాడు. గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వికెట్లు తీసి టీమిండియా విజయావకాశాలపై ఎజాజ్ పటేల్ నీళ్లు చల్లాడు. మూడు టెస్టుల సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియాకు వైట్ వాష్ తప్పలేదు.
న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 235 ఆలౌట్.
న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ : 174 ఆలౌట్.
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 59.4 ఓవర్లలో 263 ఆలౌట్ (గిల్ 90, పంత్ 60, ఎజాజ్ పటేల్ 5/103).
ఇండియా సెకండ్ ఇన్నింగ్స్: 121 ఆలౌట్