IND vs NZ Final: దేశమంతా జియో హాట్ స్టార్‌లోనే.. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ వీక్షించిన 90 కోట్ల మంది

IND vs NZ Final: దేశమంతా జియో హాట్ స్టార్‌లోనే.. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ వీక్షించిన 90 కోట్ల మంది

భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్ ఫాంలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవ్వగా..  లైవ్‌లో ఏకంగా 90.1 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డ్. ఫైనల్ మ్యాచ్ కావడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మ్యాచ్ ను చూడడానికి అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ మ్యాచ్ తో డిజిటల్ ఫ్లాట్ ఫాంలో గత రికార్డుల అన్నింటిని తిరగరాశారు నెటిజన్లు. మ్యాచ్ ముగిసే సమయానికి వ్యూయర్ షిప్ సంఖ్య 90.1 కోట్లకు పైగా (901 మిలియన్లు) చేరింది. 

దేశంలో దాదాపు 70 శాతం మంది ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో చూశారు. గ్రూప్ దశలో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను 40 కోట్లకు పైగా (400 మిలియన్ వీక్షకులు) వీక్షించారు. ఈ మ్యాచ్ లో ఇండియా 44 పరుగుల తేడాతో గెలిచింది. ఓవరాల్ గా  ఈ రికార్డ్ ఇదే టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ పేరిట ఉంది. ఈ మ్యాచ్ ను జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో 66.9 కోట్ల మంది (669 మిలియన్లు) మంది వీక్షించారు. అంతకముందు ఇండియా, పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రికార్డ్ ను బద్దలు చేసింది. చిరకాల ప్రత్యర్ధుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ వ్యూయర్ షిప్ సంఖ్య 60.2 కోట్లు (602 మిలియన్లు) దాటింది.

Also Read : రచీన్ రవీంద్రకే గోల్డెన్ బ్యాట్

ఈ బ్లాక్ బస్టర్ ఫైనల్లో భారత జట్టు ఫైనల్లోనూ అంచనాలకు తగ్గట్టుగా రాణించి న్యూజిలాండ్ కు ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్​ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో కివీస్ పై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. భారత విజయంలో రోహిత్ శర్మ (76: 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేసి అయ్యర్ రాణించాడు.