ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేతలైన న్యూజిలాండ్ మహిళలలతో భారత వనితలు అమీతుమీ తేల్చుకోనున్నారు. గురువారం(అక్టోబర్ 24) నుండి భారత్, న్యూజిలాండ్ విమెన్స్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఇరు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనుండగా.. అన్ని మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
లీగ్ దశలోనే ఇంటికి..
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు లీగ్ దశ కూడా దాటలేక పోయింది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలవ్వడం సెమీస్ అవకాశాలను బాగా దెబ్బతీసింది. అందుకు మనోళ్లు ప్రతీకారం తీర్చుకుంటారో.. లేదో వేచి చూడాలి. ఈ సిరీస్‌కు భారత రెగ్యులర్ వికెట్ కీపర్ రిచా ఘోష్(ఇంటర్ పరీక్షలు), ఆశా శోభనా(గాయం) దూరమయ్యారు. ఘోష్ గైర్హాజరీ నేపథ్యంలో యస్తికా భాటియాతో పాటు ఉమా చెత్రీని రెండో వికెట్ కీపర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు.
ALSO READ | BAN vs RSA: మెహిదీ అసమాన పోరాటం.. WTC ఎలైట్ లిస్టులో చోటు
మరోవైపు, కివీస్ మహిళలు మాత్రం టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచి మంచి ఊపు మీదున్నారు. ఇరు జట్లలోనూ స్టార్ క్రికెటర్లు ఉండటంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయనడంలో సందేహం లేదు. భారత కాలమానం ప్రకారం, గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
లైవ్ స్ట్రీమింగ్:
ఇండియా vs న్యూజిలాండ్ మహిళల ODI సిరీస్‌ను స్పోర్ట్స్ 18ను నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిజిటల్‌గా జియో సినిమాస్ యాప్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు.
వన్డే సిరీస్ షెడ్యూల్
- మొదటి వన్డే: అక్టోబర్ 24 (మోదీ స్టేడియం, అహ్మదాబాద్)
- రెండో వన్డే: అక్టోబర్ 27 (మోదీ స్టేడియం, అహ్మదాబాద్)
- మూడో వన్డే: అక్టోబర్ 29 (మోదీ స్టేడియం, అహ్మదాబాద్)
భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), సయాలీ సత్‌గారే, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, తేజల్ హసబ్నిస్, ఠాకూర్, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్.
న్యూజిలాండ్ మహిళా జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, లారెన్ డౌన్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, పాలీ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఫ్రాన్ జోనాస్, జెస్ కెర్, అమేలియా కెర్, మోలీ పెన్‌ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహూ.