ఇది కదా..ఇన్నింగ్స్ అంటే..ఏం కొట్టారు..ఏం కొట్టారు బాబాయ్. కిర్రాక్ కొట్టారు..కాదు కాదు..ఇరగ్గొట్టారు..కానే కాదు..దంచికొట్టారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ..పాక్ బౌలర్లను చితక్కొట్టారు. సిక్సులు, ఫోర్లతో కొలంబో స్టేడియాన్ని కొల్లేరు చేశారు. రాహుల్, కోహ్లీ ఉతుకుడుకు పాక్ బౌలర్లు ప్రేక్షకులయ్యారు. పోటీ పడి మరి దంచికొట్టారు. ఎగబడి ..ఈజీగా ఇద్దరు సెంచరీలు సాధించారు.
కిర్రాక్ కోహ్లీ..
రన్ మిషన్..విరాట్ కోహ్లీ మరోసారి ఝూళు విదల్చాడు. అతని కళాత్మక షాట్లు..కళ్లు చెదిరే స్మాష్ లు..కిర్రాక్ అనిపించే కవర్ డ్రైవ్ లు..వాహ్వా..వాహ్వా. ఏం కొట్టాడు కాకా అనక తప్పదు. మొదట్లో కుదుర్కోవడానికి ఇబ్బంది పడ్డ కోహ్లీ..ఆ తర్వాత అసలైన ఆటను పాక్ బౌలర్లకు ..ఫీల్డర్లకు రుచిచూపించాడు. 55 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ..ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు. క్రీజులో నిలబడి ఈజీతా సిక్సర్ల మోత మోగించాడు. ఇక సెంచరీకి దగ్గరయ్యాక..కోహ్లీ ఆట మరో లెవల్ కు చేరింది. అదే క్రమంలో కేవలం 84 బంతుల్లో శతకం సాధించాడు. ఇందులో రెండు సిక్సర్లు, 6 ఫోర్లు ఉండటం విశేషం. ఈ సెంచరీతో వన్డేల్లో 47వ శతకాన్ని పూర్తి చేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీల జాబితాలో సచిన్ 49 సెంచరీలతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
??
— BCCI (@BCCI) September 11, 2023
The two centurions for #TeamIndia ?? pic.twitter.com/mdMg5lNYHP
రాహులా..నువు కేక..
చాలా రోజుల తర్వాత టీమ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్..అయితే కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కరెక్ట్ టీమ్ పై కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కీలక దశలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్..పాక్ బౌలర్లను చితక్కొడుతూ..సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కాన్ఫిడెంట్ గా ఆడిన కేఎల్ రాహుల్..60 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ అయ్యాక..కేఎల్ రాహుల్ మరింత బాధ్యతతో బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ అయినా ఇబ్బంది పడ్డాడేమో కానీ..కేఎల్ రాహుల్ మాత్రం..కొంచెం కూడా ఇబ్బంది పడకుండా స్వేఛ్చగా బ్యాటింగ్ చేశాడు. ఇదే క్రమంలో సరిగ్గా వంద బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, రెండు సిక్సర్లున్నాయి. కేఎల్ రాహుల్ వన్డే కెరీర్ లో ఇది 6వ సెంచరీ కావడం గమనార్హం.