ఎంతగానో ఎదురుచూసిన దాయాదుల పోరు ఇరు దేశాల అభిమానులకు అసలు మజాను చూపిస్తోంది. వరుణుడు శాంతించడంతో రిజర్వ్ డే రోజు ఆట తిరిగి ప్రారంభం కాగా, కేఎల్ రాహుల్(111)- విరాట్ కోహ్లీ(122) జోడి టీమిండియాను పటిష్ట దిశలో నిలిపారు. వీరిద్దరూ పాక్ బౌలర్లను చీల్చి చెండాడుతూ సెంచరీల మోత మోగించారు. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది.
దేశమంతా హాట్ స్టార్ లోనే..
ఇండియా - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్ ఫాంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్ హాట్ స్టార్ ప్లస్ డిస్నీలో ఉచితంగా స్ట్రీమింగ్ అవ్వగా.. లైవ్‌లో ఏకంగా 3 కోట్ల మంది వీక్షించారు. ఇది ఆల్ టైం రికార్డ్. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మ్యాచ్ ను వీక్షించారు. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో గత రికార్డుల అన్నింటిని తిరగరాశారు నెటిజన్లు.
గతంలో ఈ రికార్డ్ కూడా హాట్ స్టార్ ప్లస్ డిస్నీలోనే ఉండటం విశేషం. టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా.. పాకిస్తాన్ మ్యాచ్ ను కోటి 80 లక్షల మంది లైవ్ లో చూశారు. ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయ్యింది. ఏకంగా మూడు కోట్ల మంది లైవ్ లో మ్యాచ్ చూడటం.. అది కూడా డిజిటల్ ప్లాట్ ఫాంపై కావటం విశేషం.
Hotstar viewership peaked at 2.7cr when Virat Kohli reached his century.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2023
- The highest ever peak in digital streaming's history in India....!!! pic.twitter.com/nJbi3QmeJg