ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం. ఇక ఈ రెండు జట్లు వరల్డ్ కప్ లో తలపడితే ఈ క్రేజ్ ఆకాశాన్ని దాటేస్తుంది. ప్రస్తుతం ఆసియా కప్ లో బిజీగా ఉన్న ఈ రెండు జట్లు వచ్చే నెల 14న వరల్డ్ కప్ లో ఢీకొనబోతున్నాయి. భారత్ వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ లో రౌండ్ రాబిన్ లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. నెల రోజుల సమయం ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్ చూడడానికి అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తి చూపిస్తున్నారంటే దాయాదుల మధ్య ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.
టికెట్ ధర 57 లక్షలు
ఇండియా-పాక్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు ఆన్ లైన్ లో పెట్టగా.. పెట్టిన గంటలోనే అన్నీ అమ్ముడైపోయాయి.ఈ క్రమంలోనే ముందే టికెట్లను బుక్ చేసుకున్న కొందరు ఈ టికెట్లను బ్లాక్ లో అమ్మేందుకు రెడీ అయిపోయారు. ఇందులో భాగంగా ఒక్కో టికెట్ అక్షరాలా రూ. 57 లక్షలు. వినడానికి షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. వరల్డ్ లోనే పెద్ద సెకండరీ మార్కెట్ గా పేరుగాంచిన వయాగోగో వెబ్ సైట్ లో ఇండియా-పాక్ మ్యాచ్ ఒక్క టికెట్ రేటు ఇలా ఉండడం విశేషం.
అభిమానులు సరదా కామెంట్స్
ఈ మ్యాచ్ చూడాలంటే.. మన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తుంటే.. ఈ టికెట్ రేట్లు నిజమైన ఫ్యాన్స్ కు అన్యాయం చేస్తున్నాయని మరికొందరు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా బీసీసీఐ, ఐసీసీ ఏం చేస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఇంకొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు.