వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 14 న జరగబోయే ఇండియా-పాకిస్థాన్ మ్యాచు ఈ టోర్నీకే హైలెట్ గా నిలవనుంది. ఈ మ్యాచుకు స్టేడియంలో ప్రేక్షకులు నిండిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ మెగా మ్యాచుని చూసేందుకు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, సచిన్ టెండూల్కర్ లాంటి సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నారు. ఇక మ్యాచుకు ముందు ఒక పెద్ద వేడుకను జరపనున్నారు. అయితే ఇదంతా.. గ్రౌండ్ లో జరుగుతుంది. కానీ మైదానం బయట జరిగే బెట్టింగ్ భారీగా ఉన్నట్లు తెలుస్తుంది.
భారత్-పాక్ మ్యాచ్ అంటేనే దేశంలో బెట్టింగ్ రాయుళ్లకు పండగ. మన దేశంలోనే కాదు విదేశాల్లో సైతం భారీగా బెట్టింగ్ లు వేస్తుంటారు. ఈసారి కూడా భారత్-పాక్ మ్యాచ్ పై భారీ ఎత్తున బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. అందులోనే మ్యాచ్ ఫలితంతో పాటు సెంచరీలపై ఎక్కువగా బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ల్లో నిలకడగా రాణించిన విరాట్ కొహ్లీ ఈసారి కూడా సెంచరీ సాధిస్తాడనే అంచనాలున్నాయి. అలాగే ఫామ్ లో ఉన్న రోహిత్, శ్రేయస్ వంటివారు కూడా సెంచరీలు కొడతారనే అంచనాలున్నాయి. అటు పాకిస్తాన్ లోనూ కెప్టెన్ బాబర్, తాజాగా లంకపై సెంచరీలు బాదిన రిజ్వాన్, షఫీక్ వంటి వారిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
ALSO READ: Cricket World Cup 2023: క్రికెటర్లపై పగబట్టిన భారత్ దోమలు.. డెంగ్యూ బారిన మరో దిగ్గజం
ఈ మ్యాచులో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది కాబట్టి భారత్ గెలిస్తే 1000 కి 1450 రూపాయలు.. అదేవిధంగా పాకిస్థాన్ గెలిస్తే 1000 కి 2850 రూపాయలు అందుతాయి. ఇక ఇదే కాకుండా ప్లేయర్లు ఎన్ని పరుగులు చేస్తారు అనే విషయంపై కూడా బెట్టింగ్ జరుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఏ ప్లేయర్ సెంచరీ కొడతారు అనే దానిపైన ప్రస్తుతం బెట్టింగ్ నడుస్తుంది. మొత్తానికి ఆ రోజు దేశంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో భారీగా బెట్టింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది.