యార్కర్లతో కుర్ర బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టే పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌ను భారత ఓపెనటర్లు చీల్చి చెండాడారు. యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ బౌండరీల వర్షం కురిపిస్తే.. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో సిక్స్ కొట్టడం ద్వారా భారత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ.. షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. వరుసగా తొలి ఐదు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయని రోహిత్.. ఆరో బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీ లైన్ అవతలికి తరలించాడు. దీంతో అంతర్జాతీయ వన్డేలలో షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్‌లో సిక్సర్ కొట్టిన తొలి క్రికెటర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతవరకూ మరే ఇతర క్రికెటర్ కూడా అఫ్రిది వేసిన తొలి ఓవర్‌లో సిక్సర్ కొట్టలేదు.
ALSOREAD:ఇండియా- పాక్ మ్యాచ్.. భారత్‌కు జై కొట్టిన ఆఫ్ఘన్ బ్యూటీ
What a start from Rohit Sharma!
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 10, 2023
Opens his and team India's account with a six against Shaheen - the first batter to hit a six against Shaheen in the opening over. pic.twitter.com/Yubeqy1yNi
వర్షం అంతరాయం
కాగా, ముందుగా ఊహించినట్టుగానే భారత్, పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. వర్షం అంతరాయం కలిగించే సమయానికి భారత్ స్కోర్.. 24.1 ఓవర్లలో 147/2. విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Sri Lankan ground staff are working so hard.
— Johns. (@CricCrazyJohns) September 10, 2023
- The real heroes. pic.twitter.com/LoOSL0s81f