అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మధ్య పోరు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ బ్లాక్ బస్టర్ మ్యాచు కోసం బీసీసీఐ భారీ హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ మ్యాచు ఎవరు గెలుస్తారో.. ఎవరి అవకాశాలు ఎంత ఉన్నాయో.. ఇప్పుడు చూద్దాం.
బ్యాటింగ్
భారత్ బ్యాటింగ్ చూసుకుంటే అందరూ ఫామ్ లో నే ఉన్నారు. రోహిత్, కిషాన్, అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచులో విఫలమైన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచులో సత్తా చాటారు. ముఖ్యంగా రోహిత్ భారీ ఇన్నింగ్స్ తో పాక్ కి హెచ్చరికలు పంపాడు. ఇక ఫామ్ లో ఉన్న కోహ్లీ, రాహుల్ బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు హార్దిక్, జడేజా రాణిస్తే భారత్ కి తిరుగుండదు. అయితే భారత్ ని కలవరపెట్టే విషయం ఏదైనా ఉందంటే అది లోయర్ ఆర్డర్ అని చెప్పాలి. బుమ్రా,సిరాజ్, షమీ, కుల్దీప్ కనీస స్థాయి ప్రదర్శన చేయలేకపోవడం కలవరపెట్టే విషయం.
ఇక పాక్ బ్యాటిం విషయానికి వస్తే బ్యాటింగ్ భారమంతా వికెట్ కీపర్ రిజవాన్ మీదే పడుతుంది. ఆడిన తొలి మ్యాచులోనే అబ్దుల్లా షఫీక్ సెంచరీతో అదరగొట్టేసాడు. వీరిద్దరి సెంచరీలతో శ్రీలంకపై 345 పరుగుల భారీ స్కోర్ ని కూడా ఛేజ్ చేసింది. కెప్టెన్ బాబర్ అజాంతో పాటు ఓపెనర్ ఇమాముల్ హాక్ పేలవ ఫామ్ లో ఉండడం పాకిస్థాన్ కి ప్రతికూలంగా మారింది. ఇక మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ కూడా మంచి టచ్ లో కనిపిస్తున్నారు.
బౌలింగ్
ఈ టోర్నీలో భారత్ బౌలింగ్ నెక్స్ట్ లెవల్లో సాగుతుంది. ఆస్ట్రేలియా మీద అదరగొట్టేసింది మన బౌలర్ల ఆఫ్ఘనిస్తాన్ పై పర్వాలేదనిపించారు. బుమ్రా మంచి ఆరంభాలు ఇస్తుండగా.. స్పిన్నర్ తమ పాత్రని సమర్ధవంతగా పోషిస్తున్నారు. అయితే సిరాజ్ బౌలింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఐదో బౌలర్ గా హార్దిక్ కూడా అదరగొట్టేస్తున్నాడు. ఇక పాక్ బౌలింగ్ అత్యంత చెత్తగా ఉందనే చెప్పాలి. ప్రాక్టీస్ మ్యాచులో ధారాళంగా పరుగుల సమర్పించుకున్న పాక్.. శ్రీలంకతో జరిగిన మ్యాచులో అదే పునరావృతం చేశారు. అయితే వీరు ఒక్కసారి ఫామ్ లోకి వస్తే భారత్ కి గట్టి పోటీ తప్పదు. మొత్తానికి ఈ హై వోల్టేజ్ మ్యాచులో ఎవరు సత్తా చూపించి హీరోగా మారతారో చూడాలి.