ఇండియా X పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌..నేటి నుంచి విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌

ఇండియా X  పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌..నేటి నుంచి విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌
  •     రా. 7 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో 

దంబుల్లా : విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసియా క్రికెట్​ కప్‌‌‌‌‌‌‌‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో జరిగే తమ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది. 2004లో మొదలైన ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు జరిగింది. వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో జరిగిన నాలుగుసార్లు ఇండియానే కప్‌‌‌‌‌‌‌‌ కొట్టగా, టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో మూడుసార్లు చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. 2018లో మాత్రం బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. 2022 ఫైనల్లో శ్రీలంకను ఓడించిన ఇండియా అదే జోరును కంటిన్యూ చేయాలని భావిస్తోంది. టీ20 వెర్షన్‌‌‌‌‌‌‌‌లో ఆడిన 20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఇండియా 17 విజయాలు సాధించింది.

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఆడిన 14 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 11 నెగ్గి మూడింటిలో ఓడింది. కాబట్టి కొద్దిగా దృష్టి పెట్టి ఆడితే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ పాక్‌‌‌‌‌‌‌‌ను ఓడించడం హర్మన్‌‌‌‌‌‌‌‌సేనకు పెద్ద కష్టం కాదు. స్మృతి మంధానా కీలకం కానుంది. షెఫాలీ, జెమీమా, రిచా, హర్మన్‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాట్లు ఝుళిపించాలి. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో పేసర్‌‌‌‌‌‌‌‌ పూజా,  స్పిన్నర్లు రాధా యాదవ్‌‌‌‌‌‌‌‌, దీప్తి శర్మ, సంజీవన్‌‌‌‌‌‌‌‌ సాజన, శ్రేయాంక పాటిల్‌‌‌‌‌‌‌‌ మెరవాలి. ఇక పాక్‌‌‌‌‌‌‌‌ తరఫున. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ నిడా డర్‌‌‌‌‌‌‌‌, ఇరామ్‌‌‌‌‌‌‌‌ జావేద్‌‌‌‌‌‌‌‌, ఒమైమా సోహైల్‌‌‌‌‌‌‌‌, సయీదా అరూబ్‌‌‌‌‌‌‌‌ షా కీలకం కానున్నారు.