SA vs IND,1st ODI: తుది జట్టుపై రాహుల్ హింట్..మిడిల్ ఆర్డర్‌లో సంజు శాంసన్, రింకూ సింగ్

SA vs IND,1st ODI: తుది జట్టుపై రాహుల్ హింట్..మిడిల్ ఆర్డర్‌లో సంజు శాంసన్, రింకూ సింగ్

భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే ఆడేందుకు సిద్ధమయ్యాయి. జోహనెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో  నేడు(డిసెంబర్ 17) ఈ మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్ 1-1తో ముగించిన భారత్ వన్డే సిరీస్ ఎలాగైనా గెలవాలని ఆరాటపడుతుంది. రాహుల్ సారధ్యంలోని కుర్రాళ్లతో నిండిన ఈ జట్టు సఫారీలకు సవాలుగా నిలవడం గ్యారంటీ అనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. మరోవైపు మార్కరం కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా జట్టు సొంతగడ్డపై పటిష్టంగా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ లో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. 

ఈ మ్యాచ్ పై భారత కెప్టెన్ రాహుల్ తుది జట్టులో ఎవరుంటారనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్, రింకూ సింగ్ బ్యాటింగ్ చేస్తారని తెలిపాడు. సంజు శాంసన్ 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తాడని.. అయితే వికెట్ కీపర్ గా తానే కొనసాగుతానని రాహులు తెలియజేసాడు. శాంసన్ చివరిసారిగా ఆసియా కప్ 2023 టోర్నీకి బ్యాకప్ వికెట్ కీపర్ గా సెలక్ట్ అయ్యాడు. రాహుల్ పూర్తి ఫిట్ నెస్ సాధించడంతో సంజును ఇంటికి పంపించేశారు. 

గత కొంతకాలంగా రింకూ సింగ్ చక్కగా రాణిస్తున్నాడని.. తుది జట్టులో అవకాశం ఉంటదని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక ఓపెనర్ గైక్వాడ్ జ్వరం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. అదే జరిగితే సాయి సుదర్శన్, రజత్ పటిదార్ ఇన్నింగ్స్ ఆరభించవచ్చు. ఆ తర్వాత వరుసగా శ్రేయాస్ అయ్యర్, రాహుల్, సంజు శాంసన్, రింకూ సింగ్ బ్యాటింగ్ కు వస్తారు. ఇక ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఫాస్ట్ బౌలర్లుగా అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉండొచ్చు. ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు అవకాశం దక్కుతుంది. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లైవ్ ప్రసారమవుతుంది.