తొలి రోజు తడబడ్డ టీమిండియా.. ఆదుకున్న రాహుల్

తొలి రోజు తడబడ్డ టీమిండియా.. ఆదుకున్న రాహుల్
  •     పోరాడిన విరాట్​ కోహ్లీ,  శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్​, శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     రబాడకు ఐదు వికెట్లు

సెంచూరియన్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేట మొదలుపెట్టిన టీమిండియా  తొలి రోజు తడబడి కోలుకుంది. కగిసో రబాడ (5/44) పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకు కుదేలైన ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (105 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 70 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. దీంతో ఇరుజట్ల మధ్య మంగళవారం మొదలైన తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 59 ఓవర్లలో 208/8  స్కోరు చేసింది. రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (38), శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (31) ఓ మాదిరిగా ఆడారు. 

24 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే 3 వికెట్లు..

పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్లకు అనుకూలంగా ఉండటం, వాతావరణం మేఘావృతం కావడంతో సఫారీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బవూమ టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచి బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను..  కొత్త బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పేసర్లు రబాడ, నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/50) బెంబేలెత్తించారు. పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు వేరియబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాబడుతూ ఆరంభం నుంచే ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (17), కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (5)ను ముప్పుతిప్పలు పెట్టారు. ఐదో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రబాడ వేసిన షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌండ్రీ వద్ద బర్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చిక్కాడు. కొద్దిసేపటికే బర్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాలో యశస్వి, శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి షాకిచ్చాడు. దీంతో ఇండియా 24/3తో కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గట్టెక్కించే బాధ్యత తీసుకున్న శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోహ్లీని కూడా ఈ ఇద్దరు బాగా ఇబ్బందిపెట్టారు. 4 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1/52) వదిలేశాడు. ఇక్కడి నుంచి ఈ ఇద్దరు ఆచితూచి ఆడారు. రబాడను వదిలేసి మిగతా వారి బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ నాలుగు ఫోర్లు కొట్టి గాడిలో పడ్డాడు. 33 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్క్వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జోర్జి జారవిడిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 67 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించడంతో ఇండియా 91/3 స్కోరుతో లంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. 

రబాడ పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బ

సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రబాడ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జోరు చూపెట్టాడు. ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెండువైపులా స్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఫలితాన్ని రాబట్టాడు. అద్భుతమైన ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. తర్వాత ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కోహ్లీని డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడేశాడు. ఈ క్రమంలో మరో మూడు ఓవర్ల తర్వాత పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వేసిన బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తాకుతూ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతుల్లోకి వెళ్లింది. ఇండియా స్కోరు 107/5గా మారింది. కొత్తగా వచ్చిన రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యమిస్తే.. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రబాడ వరుసగా షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిచ్చాడు. 35వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (8)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (24) క్రీజులోకి వచ్చాడు. రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఓ 10 ఓవర్ల పాటు సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నడిపించిన శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రబాడ పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు నిలవలేకపోయాడు. 47వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను  ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో రబాడ14వ సారి ఐదు వికెట్ల హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖాతాలో వేసుకున్నాడు. 176/7తో ఇండియా టీ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. మూడో సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్న రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 80 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేయగా, బుమ్రా (1) నిరాశపర్చాడు. చివరకు 208/8 స్కోరు ఉన్న దశలో బ్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు తొలి రోజు ఆటను ఆపేశారు.

బవూమాకు గాయం! 

తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలకడగా ఆడుతున్న సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెంబా బవూమ హ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజ్యురీకి గురయ్యాడు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా కవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి కొట్టిన డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే  క్రమంలో బవూమ డైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. తర్వాత నొప్పితో ఇబ్బందిపడిన అతన్ని ఫిజియో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయటకు తీసుకెళ్లాడు. బవూమ ఎడమ తొడ కండరం చీరుకుపోయినట్లు స్కానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేలడంతో మళ్లీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రాలేదు. పూర్తి స్థాయి మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత అతను మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడటంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 59 ఓవర్లలో 208/8 (రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 70*, కోహ్లీ 38, 5/44).

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (57 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2101). కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (42 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2097)ను అధిగమించాడు.