క్రికెట్ అభిమానులకు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. మరికాసేపట్లో భారత్ , సౌతాఫ్రికా జట్ల మధ్య మొదలు కావాల్సిన మొదటి టెస్టు మ్యాచ్ వర్షార్పణం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తొలి రోజు వర్షం వలన మ్యాచ్ ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించింది.
సెంచూరియన్ లో వర్షం పడే అవకాశం 96 శాతం, పిడుగులు పడే అవకాశం 36 శాతం ఉన్నట్లుగా వాతావరణ శాఖ స్పష్ట చేసింది. తొలి రోజు ఉదయం భారీ వర్షం, మధ్యాహ్నం సమయంలో జల్లులు పడే అవకాశం ఉండటంతో తొలి రోజు మ్యాచ్ జరగడం కష్టమని అంచానా వేసింది. గత రెండు రోజులుగా కూడా అక్కడ ఎడతెగని వర్షం కురిసింది.
31 ఏండ్ల నిరీక్షణ..
మహ్మద్ అజరుద్దీన్ (1992) మినహా, సచిన్ టెండూల్కర్ (1996), సౌరవ్ గంగూలీ (2001), రాహుల్ ద్రవిడ్ (2006–07), ఎం.ఎస్ ధోనీ (2010–11, 2013–14), విరాట్ కోహ్లీ (2018–19, 2021–22) నాయకత్వంలోని ఇండియా టీమ్.. సౌతాఫ్రికాపై టెస్ట్ మ్యాచ్ గెలిచింది. కానీ ఇప్పటి వరకు సిరీస్ విజయాన్ని మాత్రం అందుకోలేదు.
ఇక్కడ ఆడిన ఎనిమిది టెస్టు సిరీస్‌ల్లో భారత్ ఏడు ఓడి, ఒక్కసారి మాత్రమే (2010-11) డ్రా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో 31 ఏండ్లుగా పోరాడుతున్న ఓ అరుదైన సిరీస్ విజయం కోసం ఇప్పుడు టీమిండియా రెడీ అవుతుంటే వర్షం బ్యాడ్ న్యూస్ తో వెల్కమ్ చెప్పింది.