తొలి టీ20 విజయంతో జోరుమీదున్న యంగ్ టీమిండియా.. సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో స్పష్టమైన ఆధిక్యంలో నిలవాలని భావిస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనలే అనుకుంటే సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ ఓడటం సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా దెబ్బతీసింది. దీంతో రెండో మ్యాచ్ లో గెలిచి లెక్క సరిచేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయమన్న దశలో వర్షం రూపంలో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అక్యూవెదర్ ప్రకారం.. టాస్ సమయంలో వర్షం 49 శాతం నుండి 54 శాతం మధ్య కురుస్తుంది. రాత్రి 8 గంటలకు 63 శాతం.. రెండో ఇన్నింగ్స్ లో 40 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ మొత్తం రద్దయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే 5 ఓవర్ల మ్యాచ్ జరగనుంది. వాతావరణం చల్లగా ఉండడంతో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. రాత్రి 7.30 గంటలకు స్పోర్ట్స్–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ప్రస్తుతం సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
జట్లు (అంచనా)
ఇండియా :
శాంసన్, అభిషేక్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ / రమణ్‌దీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి.
సౌతాఫ్రికా :
మార్‌క్రమ్ (కెప్టెన్), రికెల్టన్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, క్రుగెర్, యాన్సెన్, సిమిలెన్, కోయెట్జీ, కేశవ్ మహారాజ్, పీటర్ / బార్ట్‌మన్