IND vs SA Final: ఫైనల్లో ప్రయోగాలు చేస్తారా..? భారత్, దక్షిణాఫ్రికా తుది జట్లు ఇవే

IND vs SA Final: ఫైనల్లో ప్రయోగాలు చేస్తారా..? భారత్, దక్షిణాఫ్రికా తుది జట్లు ఇవే

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ శనివారం (జూన్ 29) జరగనుంది. బార్బడోస్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ లవర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు వరల్డ్ కప్ ట్రోఫీ లేని సౌతాఫ్రికా ఒక వైపు టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంటే.. వరుసగా రెండు ఐసీసీ ఫైనల్స్ ఓడిపోయిన టీమిండియా ఈ టైటిల్ ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకుంటుంది. ఈ మెగా ఫైనల్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఎలాంటి తుది జట్టుతో బరిలోకి దిగుతాయో ఇప్పుడు చూద్దాం. 

మార్పుల్లేకుండానే ఇరు జట్లు:

సాధారణంగా సెమీ ఫైనల్లో విజయం సాధిస్తే ఆ జట్టునే ఫైనల్ కు కొనసాగిస్తారు. ఫైనల్లో ఏ జట్టు కూడా మార్పులు చేయడానికి సాహసం చేయకపోవచ్చు. దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ హెన్డ్రిక్స్ ఫామ్ లో లేకపోయినా అతను ఫైనల్లోనూ తుది జట్టులో అవకాశం దక్కనుంది. కెప్టెన్ మార్కరం, మిల్లర్, క్లాసెన్, ట్రిస్టాన్ స్టబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిడిల్ ఆర్డర్ లో ఆడతారు. ఆల్ రౌండర్ జాన్సెన్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. రబాడ, మహరాజ్, అన్రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోకియా, షంసి ఫామ్ లోనే ఉండడంతో వీరి స్థానాలకు ఎలాంటి ముప్పు ఉండదు. 

టీమిండియా విషయానికి వస్తే తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది. పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించినా సెమీ ఫైనల్ జట్టుతోనే బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఆల్ రౌండర్ దూబే ఫామ్ ఆందోళన కలిగిస్తున్నా ఇప్పటికిప్పుడు అతని స్థానంలో కొత్త ప్లేయర్ ను తీసుకువచ్చే సాహసం యాజమాన్యం చేయకపోవచ్చు. ఓపెనర్ గా విఫలమవుతున్న కోహ్లీ ఫైనల్లోనూ రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. హార్ధిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు ఆల్ రౌండర్లు ఉండడం భారత జట్టుకు కలిసి రానుంది. 

భారత్ (తుది జట్టు అంచనా): 

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్.

దక్షిణాఫ్రికా(తుది జట్టు అంచనా):

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, తబ్రైజ్ షమ్సీ