భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి(నవంబర్ 08) నుంచి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 కింగ్స్‌మీడ్(డర్బన్) వేదికగా భారత కాలమానం ప్రకారం, శుక్రవారం రాత్రి 8:30 గంటలకు షురూ కానుంది. సఫారీల గడ్డపై విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని టీమిండియా చూస్తుంటే.. టీ20 ప్రపంచకప్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రొటీస్ జట్టు చూస్తోంది.
హోరాహోరీ పోరు తప్పదు
సొంతగడ్డపై ఆడుతుండటం సఫారీలకు కలిసొచ్చే అంశం అయిన్నప్పటికీ, సూర్య సేనను తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ ఇరు విభాగాల్లోనూ టీమిండియా బలంగా కనిపిస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్య, హార్దిక్, రింకూ రూపంలో బ్యాటింగ్.. అర్ష్‌దీప్, అక్షర్‌పటేల్, అవేశ్‌ఖాన్, వరుణ్ చక్రవర్తి రూపంలో నాణ్యమైన బౌలర్లకు కొదవలేదు. దాంతో, అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ లభించొచ్చు.
Also Read:-కుర్రాళ్లకు అవకాశాలు ఇద్దాం.. ఆ ఒక్క టోర్నీ ఆడి తప్పుకుంటా
'ఫ్రీ'గా ఇలా చూడండి
భారత్- దక్షిణాఫ్రికా తొలి టీ20.. టీవీలో స్పోర్ట్స్ 18-1, స్పోర్ట్స్ 18-2 ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిజిటల్‌గా అభిమానులు జియో సినిమా(JioCinema) యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగా ఆస్వాదించవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూసింగ్, రమన్‌దీప్‌సింగ్, అక్షర్‌పటేల్, అవేశ్‌ఖాన్, అర్ష్‌దీప్‌సింగ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికల్టన్, మార్క్ రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, సిమ్లెన్, పీటర్, కేశవ్ మహారాజ్, ఒట్టోనిల్ బార్ట్‌మన్.