IND vs SL 2024: శ్రీలంకతో తొలి టీ20.. టీమిండియా తుది జట్టు ఇదే

IND vs SL 2024: శ్రీలంకతో తొలి టీ20.. టీమిండియా తుది జట్టు ఇదే

భారత్, శ్రీలంక మధ్య శనివారం (జూలై 27) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి జట్టును ప్రకటిస్తారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. మొత్తం 15 మంది సభ్యుల్లో నలుగురు బెంచ్ కు పరిమితం కాక తప్పదు. భారత తుది జట్టును ఒకసారి పరిశీలిద్దాం. 

ఓపెనర్లుగా గిల్, జైశ్వాల్
 
తొలి టీ20 మ్యాచ్ కు వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ తో పాటు యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. మూడో స్థానంలో రిషబ్ పంత్ రానున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కు నిరాశ తప్పకపోవచ్చు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్,హార్దిక్ పాండ్య ఐదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. అయితే ఆరో స్థానంలో రింకూ సింగ్, శివమ్ దూబేలలో ఎవరికీ ఛాన్స్ దక్కుతుందో చూడాలి. ఆల్ రౌండర్ గా దూబేకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత  వరుసగా ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రావడం దాదాపు ఖాయం. 

ఏకైక స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ భారత తుది జట్టులో ఉండడం ఖాయం. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ప్లేయింగ్ 11 లో ఉంటారు. రియాన్ పరాగ్, సంజు శాంసన్, ఖలీల్ అహ్మద్, సంజు శాంసన్ లు బెంచ్ కు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీలంక కొత్త కెప్టెన్ అసలంక నాయకత్వంలో ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందో చూడాలి.

భారత్ తుది జట్టు అంచనా 

శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్/శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక తుది జట్టు అంచనా
 
పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, మతీషా పతిరణ, బినుర ఫెర్నాండో