శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ శనివారం (జూలై 27) తొలి టీ20 మ్యాచ్ కు సిద్ధం సిద్ధమవుతోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత తొలిసారి టీమిండియా తొలి సారి పూర్తి స్థాయి జట్టుతో ఆడుతున్న సిరీస్ ఇది.
ద్రవిడ్ స్థానంలో కోచింగ్ పగ్గాలు అందుకున్న గౌతమ్ గంభీర్, టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వచ్చిన సూర్యకుమార్ తొలి సిరీస్‌లోనే తమ మార్కు చూపెట్టాలని ఆశిస్తున్నారు. వైస్ కెప్టెన్ పగ్గాలు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అప్పజెప్పారు. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్ లాంటి యువ క్రికెటర్లు నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం.
బౌలింగ్ విషయానికి వస్తే స్టార్ పేసర్ బుమ్రాకు ఈ టూర్ లో రెస్ట్ ఇచ్చారు. దీంతో పేస్ బౌలింగ్ భాధ్యతను అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ నడిపించనున్నారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో దారుణ ప్రదర్శన తర్వాత శ్రీలంక ఆడుతున్న తొలి సిరీస్. సొంతగడ్డపై సత్తా చాటి భారత్ కు షాక్ ఇవ్వాలని చూస్తుంది. శ్రీలంక కొత్త కెప్టెన్ చరిత్ అసలంక నాయకత్వంలో సొంతగడ్డపై ఈ సిరీస్‌లో అయినా సత్తా చాటాలని కోరుకుంటోంది.
టీ20 సిరీస్ షెడ్యూల్
- మొదటి టీ20 - జూలై 27(శనివారం)
- రెండో టీ20 - జూలై 28(ఆదివారం)
- మూడో టీ20 - జూలై 30(మంగళవారం)
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్-లంక సిరీస్‌లోని అన్ని మ్యాచుల్ని సోనీ సంస్థ టెలికాస్ట్ చేయనుంది. రాత్రి 7 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ మ్యాచ్ లు చూడొచ్చు. సోనీ టెన్ 3 ఛానల్లో ఈ మ్యాచ్ హిందీ కామెంట్రీ వస్తుంది. సోనీ టెన్ 5 ఛానల్లో ఇంగ్లీష్ కామెంట్రీలో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలనుంటే సోనీ లివ్ యాప్‌లో ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది.