IND vs SL ODI: రేపటి నుంచి ఇండియా- శ్రీలంక వన్డే సిరీస్.. షెడ్యూల్, స్క్వాడ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

IND vs SL ODI: రేపటి నుంచి ఇండియా- శ్రీలంక వన్డే సిరీస్.. షెడ్యూల్, స్క్వాడ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

శ్రీలంకతో టీ20 సిరీస్ 3-0 తేడాతో విజయవంతంగా ముగించిన భారత జట్టు వన్డే సిరీస్ పై దృష్టి పెట్టనుంది. టీ20, వన్డే జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవలే అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్థార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వన్డే జట్టులో చేరారు. వీరితో పాటు వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో స్థానం కోల్పోయిన అయ్యర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. యువ బ్యాటర్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 

టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో ఆందరి కళ్ళు వీరిపైనే ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాక్టీస్ గా ఈ సిరీస్ భారత ఆటగాళ్లకు ఉపయోగపడనుంది. మూడు వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే శుక్రవారం (ఆగస్టు 2) జరుగుతుంది. ఆదివారం (ఆగస్టు 4) రెండో వన్డే.. బుధవారం (ఆగస్టు 7) మూడో వన్డే జరుగుతాయి. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. అన్ని మ్యాచ్ లు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. 

మరోవైపు శ్రీలంక కొత్త కెప్టెన్చరిత అసలంక కెప్టెన్సీలో బరిలోకి దిగుతుంది. కీలక ఫాస్ట్ బౌలర్లు దూరం కావడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించకపోవడంతో శ్రీలంక 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ఎదురు చూస్తుంది. ఓపెనింగ్ బ్యాటర్ నిషాన్ మదుష్కకు తొలిసారి వన్డే జట్టులో స్థానం దక్కింది. 

షెడ్యూల్

1వ వన్డే - ఆగస్టు 2

2వ వన్డే - ఆగస్టు 4

3వ వన్డే - ఆగస్టు 7

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

భారత్-శ్రీలంక మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. Sony LIVలో ఈ మ్యాచ్ లు లైవ్ లో చూడొచ్చు. 

స్క్వాడ్స్

భారత్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ , హర్షిత్ రనా

శ్రీలంక:

పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక (కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానాగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, నిషాన్ మదుష్క, మహీష్ తీక్షణ, అఖిల ధనుంజయ్, మతీశ పతిరానా,  దిల్షాన్ మధుశంక,అసిత ఫెర్నాండో