సొంత గడ్డపై లంక దండయాత్ర.. అదొక్కటే టీమిండియాకు మైనస్ కానుందా..?

సొంత గడ్డపై లంక దండయాత్ర.. అదొక్కటే టీమిండియాకు మైనస్ కానుందా..?

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత మరో కీలక పోరుకి సిద్ధమవుతుంది. సొంతగడ్డపై తిరుగులేని జట్టుగా పేరున్న శ్రీలంకతో సమరానికి సై అంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ కి కొలొంబోలోని  ప్రేమదాస స్టేడియం ఆతిధ్యమిస్తుంది. ఇక ఈ  మ్యాచ్ విషయానికి వస్తే లంకపై భారత్ విజయం సాధించడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. సొంతగడ్డపై లంక ఆడిన చివరి 13 వన్డేల్లో విజయం సాధించడం ఆ జట్టుకి కొండంత బలం. బ్యాటింగ్,బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న శనక సేనను ఓడించాలంటే అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సిందే.

 
అదొక్కటే మైనస్:

బలాలాలను పరిశీలిస్తే ఈ మ్యాచులో భారత్ దే పై చేయి అయినప్పటికీ.. వరుసగా ఆదివారం, సోమవారం పాక్ తో మ్యాచ్ ఆడటం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. టీమిండియా కనీసం 24 గంటల సమయం లేకుండానే శ్రీలంకతో నేడు తలపడబోతుంది. ఈ ఒక్క విషయ మినహాయిస్తే రోహిత్ సేనకు ఎలాంటి సమస్యలు లేవు. అందరూ ఫామ్ లోనే ఉండడంతో ఈ విజయం మీద ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. స్థాయికి తగ్గట్టు ఆడితే శ్రీలంక జైత్రయాత్రకు భారత్ బ్రేక్ లు వేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
 
ఇక ఈ  మ్యాచులో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్ బెర్త్ ని దాదాపుగా కన్ఫర్మ్ చేసుకున్నట్టే, ఇప్పటికే బంగ్లాదేశ్ రెండు పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్ చేతిలో భారీ పరాజయం పాకిస్థాన్ జట్టుకి ఫైనల్ బెర్త్ ఆశలను సంక్లిష్టం చేసింది.         

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)