ఇండియా x టోగో..నేటి నుంచి డేవిస్ కప్‌‌‌‌ పోరు

ఇండియా x టోగో..నేటి నుంచి డేవిస్ కప్‌‌‌‌ పోరు

న్యూఢిల్లీ : ఇండియా టెన్నిస్ టీమ్‌‌‌‌ స్వదేశంలో డేవిస్ కప్‌‌‌‌ పోటీకి రెడీ అయింది. వరల్డ్ గ్రూప్‌‌‌‌–1 ప్లే ఆఫ్స్‌‌‌‌లో భాగంగా శనివారం తమ కంటే తక్కువ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ అయిన టోగోతో జరిగే పోరులో ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. సుమిత్ నాగల్ గైర్హాజరీలో ఈ కప్‌‌‌‌లో రీఎంట్రీ ఇస్తున్న శశి కుమార్‌‌‌‌‌‌‌‌ ముకుంద్‌‌‌‌ విజయంతో తాను గెలవడంతో పాటు జట్టు విజయానికి కృషి చేయాలని చూస్తున్నాడు. 

తొలి రోజు జరిగే మొదటి సింగిల్స్ మ్యాచ్‌‌‌‌లో అతను లోయివా ఎయైటె అజవోన్‌‌‌‌తో పోటీ పడనున్నాడు. రెండో సింగిల్స్‌‌‌‌లో సెటోడ్జితో రామ్‌‌‌‌కుమార్ రామనాథన్ తలపడతాడు. ఆదివారం జరిగే డబుల్స్‌‌‌‌లో శ్రీరామ్‌‌‌‌ బాలాజీతో కలిసి తెలంగాణ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్‌‌‌‌ బరిలోకి దిగుతాడు.