మరికొన్ని గంటల్లో ఇండియా- వెస్టిండీస్ జట్ల మధ్య టెస్ట్ సమరం మొదలు కానుంది. జులై 12న డొమినికా వేదికగా ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, సోనీ నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు.
భారత అభిమానులు ఎవరైనా ఈ మ్యాచ్‌లను టీవీలో చూడాలనుకుంటే దూరదర్శన్ నెట్‌వర్క్ అయిన DD స్పోర్ట్స్‌లో మాత్రమే చూడవచ్చు. మొత్తం 6 భాషల్లో లైవ్ ప్రసారం కానుంది. హిందీ, తెలుగు, తమిళం, బంగ్లా, కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు. అలాగే, డిజిటల్‌గా చూడాలనుకునే వారు జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ యాప్‌లలో లైవ్ చూడొచ్చు.
భారత టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్ కుమార్.
వెస్టిండీస్ జట్టు(తొలి టెస్ట్):
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథనేజ్, తేజ్‌నరైన్ చందర్‌పాల్, రఖీమ్ కార్న్‌వాల్, జోష్వా ద సిల్వా, షనన్ గాబ్రియల్, జాసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్
రిజర్వ్ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.